English | Telugu
టేస్టీ తేజ వన్ మ్యాన్ షో.. ఓడినా సరే !
Updated : Nov 1, 2024
బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లలో అసలేం ఆడరు అన్న కంటెస్టెంట్స్ బాగా ఆడుతూ వహ్ అనిపించుకుంటున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో టేస్టీ తేజ పోరాట పటిమ ప్రదర్శించాడు.
నిన్న జరిగిన టాస్క్ లో బీబీ ఇంటికి దగ్గరగా వచ్చి మెగా చీఫ్ కంటెండర్లుగా ఎంపికైన వారు హరితేజ, నిఖిల్, అవినాష్, నబీల్, ప్రేరణ, తేజ.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. బ్లూ టీమ్ నుంచి ముగ్గురు, గ్రీన్ నుంచి ఇద్దరూ, రెడ్ నుంచి ఒకరు మెగా చీఫ్ కంటెండర్లు అయ్యారన్నమాట. ఎల్లో టీమ్ ఒక్క టాస్కులో కూడా గెలవకపోవడంతో వాళ్ల నుంచి ఎవరూ చీఫ్ రేసులోకే రాలేదు. ఇక మరో టాస్క్ 'తిరుగుతూనే ఉండు.. గెలిచే వరకూ' . ఈ టాస్కులో మీరు మీ కంటెండర్ షిప్ బ్యాగ్‌ను భుజాలపై మోస్తూ మీ బ్యాగ్‌ను కాపాడుకోవాల్సి ఉంటుంది.. ప్రతి రౌండ్ ముగిసేసరికి ఎవరి బ్యాగ్‌లో అయితే తక్కువ బాల్స్ ఉంటాయో వాళ్లు రేసు నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.. బ్యాగ్స్‌ను ధరించి బ్లూ సర్కిల్‌లో నిల్చోండి అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక ఈ టాస్కుకి యష్మీ సంచాలక్. బజర్ మోగిన వెంటనే హరితేజను నిఖిల్ టార్గెట్ చేశాడు. కాసేపటికే ఆమె బ్యాగ్‌లో బాల్స్ చాలా వరకూ పడిపోయాయి. దీంతో ఎలాగో పోయిందని ఇక తన బ్యాగ్ పట్టించుకోకుండా ప్రేరణను టార్గెట్ చేసింది హరి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గట్టిగానే ఫైట్ జరిగింది. ప్రేరణ జుట్టు పట్టుకొని ఇష్టమొచ్చినట్లు లాగేసింది హరితేజ. మొత్తానికి ఈ రౌండ్ ముగిసేసరికి హరితేజ ఔట్ అయి వచ్చేసింది. ఆ తర్వాత హరితేజను సంచాలక్ చేశాడు బిగ్‌బాస్.
ఇక మళ్లీ బజర్ మోగిన వెంటనే తెలివిగా తేజను టార్గెట్ చేశారు నిఖిల్-ప్రేరణ. వెనకాల నుంచి నిఖిల్.. ముందు నుంచి ప్రేరణ టార్గెట్ చేసినా చాలా సేపు తన బ్యాగ్‌ను కాపాడుకున్నాడు తేజ. అయితే నిఖిల్ వెనకాల నుంచి తేజ చేతులు పట్టుకొని తిప్పేయడంతో ప్రేరణ ముందు నుంచి తేజ బ్యాగ్ చించేసింది. అయినా సరే కిందపడినా కూడా తేజ పోరాడాడు. రెండు మూడు సార్లు కింద పడి తేజ తలకి కూడా దెబ్బ తగిలింది. అయినా సరే బ్యాగ్‌ను వదలకుండా అలానే ఆడాడు తేజ. ఓడిపోతానని తెలిసినా కూడా చివరి వరకూ తేజ పోరాడిన విధానం మాత్రం చాలా బాగా అనిపించింది. మొత్తానికి రౌండ్ ముగిసేసరికి తేజ ఔట్ అయ్యాడు. ఓడిపోతానని తెలిసిన కూడా చివరి వరకూ తేజ పోరాడిన విధానం మాత్రం చాలా బాగా అనిపించింది. మొత్తానికి రౌండ్ ముగిసేసరికి తేజ ఔట్ అయ్యాడు. ఇందులో టేస్టీ తేజ ఆటతీరుకి జనాలు ఫిధా అయ్యారు.