English | Telugu

తన పాప కోసం కావ్య వెతుకులాట.. మినిస్టర్ దొరికిపోతాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -932 లో.....మినిస్టర్ తన భార్య దగ్గరికి వస్తాడు. ఏవండీ మన పాప ఎలా ఉంది చెప్పండి అని తన భార్య తులసి అడుగుతుంది. పాప బాగుందని మినిస్టర్ చెప్తాడు. అదేంటి పాపకి ప్రాబ్లమ్ ఉంది కదా అని డాక్టర్ చెప్తాడు. ప్రాబ్లమ్ లేదని మినిస్టర్ కవర్ చేస్తాడు. పాప కొంచెం వెయిట్ తక్కువగా ఉందని ఇంకుబేటర్ లో పెట్టారని మినిస్టర్ కవర్ చేస్తాడు. నాకు నా బిడ్డని చూడాలని ఉందని తులసి అంటుంటే.. సరే పదా తీసుకొని వెళ్తానని పాపని గ్లాస్ బయట ఉండి చూపిస్తాడు.

పాప చాలా బాగుందని తులసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. తులసికి పాప విషయం తెలిస్తే ఏమవుతుందో అని భయపడి రుద్రాణికి ఫోన్ చేసి కలవాలని అంటాడు మినిస్టర్. ఆ తర్వాత రుద్రాణిని మినిస్టర్ కలిసి మాట్లాడుతాడు. మీరు చెప్పినట్లు పిల్లలని మార్చడానికి నేను ఒప్పుకుంటున్నానని మినిస్టర్ అంటాడు. నాకు తెలుసు ఆరోగ్యంగా లేని బిడ్డని నీ భార్య చేతుల్లో పెట్టలేవని అని రుద్రాణి అంటుంది. ఇప్పటికిప్పుడు వేరొక పాప ఎక్కడ దొరుకుతుందని మినిస్టర్ అనగానే ఇంకుబేటర్ లో ఉన్న కావ్య పాపని చూపిస్తుంది రుద్రాణి. వాళ్ల పాపే అని మినిస్టర్ కి రాజ్, కావ్యలని చూపిస్తుంది రుద్రాణి. డాక్టర్ పిల్లలని మార్చాలని రుద్రాణి అంటుంది. డాక్టర్ అలా చెయ్యడని మినిస్టర్ చెప్తాడు.

అయితే నర్సుతో చేయించమని రుద్రాణి అనగానే మినిస్టర్ సరే అంటాడు. నేను నా భార్య గురించి ఇదంతా చేస్తున్నాను.‌ మరి మీకేం అవసరం అని రుద్రాణితో మినిస్టర్ అనగానే.. నేను నా పిల్లల భవిష్యత్తు గురించి అని రుద్రాణి అంటుంది. రాత్రికి నర్సు పిల్లలని చేంజ్ చేస్తుంది. మరుసటిరోజు తులసి దగ్గరికి కావ్య పాపని తీసుకొని నర్సు వస్తుంది. తనని చూసి తులసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు కావ్య దగ్గరికి తులసి పాపని తీసుకొని రాగానే కావ్య గుర్తుపట్టి.. ఈ పాప నా కూతురు కాదని అంటుంది. తను మొదటిసారి చూసినప్పుడు చేతికి పుట్టుమచ్చ ఉన్న విషయం గుర్తుచేసుకొని ఈ పాప నా పాప కాదని కావ్య చెప్పగానే అందరు షాక్ అవుతారు. తరువాయి భాగంలో కావ్య తన పాప గురించి హాస్పిటల్ లో వెతుకుతుంది. ఆ విషయం మినిస్టర్ కి రుద్రాణి చెప్పి త్వరగా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి వెళ్ళమని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.