English | Telugu
Illu illalu pillalu Serial: అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!
Updated : Jan 17, 2026
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.
ఏంటి సూట్ కేస్ తీసుకొచ్చారా అని వాళ్ళ ఆయనని కామాక్షి అడుగగా తెచ్చానని అతను అంటాడు. ఎందుకు ఇంత చిన్నది తీసుకొచ్చారని వాళ్ళ ఆయనని కామాక్షి తిడుతుంది. ఆ తర్వాత తిరుపతి వాళ్ళిద్దరి దగ్గరికి వస్తాడు. ఏంటి ఈ సూట్ కేస్ అని అతను అడుగగా.. మా ఆయన బట్టలు అని కామాక్షి చెప్తుంది. ఇక తిరుపతి ఆ బ్యాగ్ చూసి..ఓహో అర్థమైంది మొత్తం సర్దేద్దామని తీసుకొచ్చావా అని తిరుపతి అడుగగా నా ఇల్లు నా ఇష్టం అని కామాక్షి అంటుంది. ఆ తర్వాత ఎంగేజ్ మెంట్ కోసం పెళ్ళివాళ్ళు వస్తారు. వారిని రామరాజు కుటుంబం దగ్గరుండి రిసీవ్ చేసుకుంటారు. ఇక వేదవతి వారికి దిష్టి తీసి దిష్టి నీళ్ళు బయట పడబోస్తుంటే ఎదురింట్లో వాళ్ళ అక్క భద్రవతి కనపడుతుంది. తను కాఫీ తాగుతుంటుంది. వేదవతి చూడగానే కావాలనే భద్రవతి కాఫీ కప్పుని పై నుండి కిందపడేస్తుంది. అది చూసి వేదవతి షాక్ అవుతుంది.
ఈ పెళ్ళి ఆపడానికి అక్క ఏమైనా ప్రయత్నిస్తుందా అని వేదవతి ఆలోచనలో పడుతుంది. మరోవైపు ఎంగేజ్ మెంట్ కి వచ్చినవాళ్ళకి అందరిని పరిచయం చేస్తుంటాడు రామరాజు. శ్రీవల్లి ఫ్యామిలీని పరిచయం చేయగానే ఆనందరావు మాట్లాడిన మాటలకి వాళ్ళంతా నవ్వుతారు. ఆ తర్వాత వేదవతి ఎక్కడ అని రామారాజు అడుగుతాడు. ఇక తనని వెతుక్కుంటూ నర్మద, ప్రేమ వెళ్తారు. అదే సమయంలో ధీరజ్ ని పరిచయం చేస్తాడు రామరాజు. ధీరజ్ భార్య ప్రేమ అని రామరాజు పరిచయం చేద్దామంటే తను అక్కడ ఉండదు.. నువ్వు వెళ్ళి తీసుకురారా అని ధీరజ్ ని పంపిస్తాడు రామరాజు. మరోవైపు ప్రేమ, నర్మద ఇద్దరు వెళ్ళేసరికి వేదవతి దీర్ఘంగా ఆలోచిస్తుంటుంది. ఇక నర్మద, ప్రేమ వెళ్లి ఏమైందని అడుగుతారు తను ఏం చెప్పదు. ఆ తర్వాత ముగ్గురు ఇంటి లోపలికి వెళ్తారు. మరోవైపు ప్రేమని ధీరజ్ ఎంత రిక్వెస్ట్ చేసినా తను ఎంగేజ్ మెంట్ జరిగే చోటుకి రాకుండా తన గదిలో అలిగి కూర్చుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.