English | Telugu

Karthika Deepam2: సుమిత్రకి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పేసిన జ్యోత్స్న.. టెన్షన్ లో కార్తీక్, దీప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం-2 (Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-569లో.. దాస్ ని ఒక దగ్గర బంధిస్తుంది జ్యోత్స్న. తనకి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు జ్యోత్స్న అని దాస్ అంటాడు. నా జాగ్రత్త నాకు తెలుసు నాన్న నువ్వు జాగ్రత్తగా ఉండమని జ్యోత్స్న చెప్పి వెళ్తుంది. దాస్ ఫోన్ ని ఛార్జ్ పెట్టమని, కాల్ చేస్తున్నారో చూడాలి.. ఆ ఫోన్ పట్టుకొని సిటీ అంతా తిరమని రౌడీలకి జ్యోత్స్న చెప్పి వెళ్ళిపోతుంది.

మరోవైపు దాస్ గురించి కార్తీక్, దీప ఇద్దరు మాట్లాడుకుంటారు. నేను అక్కడికి వెళ్ళేసరికి జ్యోత్స్నతో పాటు పారిజాతం ఉంది. పారిజాతం ఉండగా దాస్ ని జ్యోత్స్న ఏం చేయలేదు ఎందుకంటే పారిజాతంకి కొడుకు అంటే ప్రేమ. అయితే ఆమెకి తెలియకుండా దాస్ ని జ్యోత్స్న ఏదైనా చేసుండాలి. లేదంటే దాస్ తన కోపాన్ని అణుచుకొని ఉండాలని దీపతో కార్తీక్ అంటాడు. ఇక మరుసటి రోజు కార్తీక్, దీప ఇద్దరు శివన్నారాయణ ఇంటికి వెళ్తారు. ఈ రోజు అత్తయ్యని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలని కార్తీక్ అంటాడు. మరి ఎలా చెప్పాలని దీప అడుగగా.. మామయ్య చెప్పినట్టే మనం ఒక డ్రామా ఆడాలని, నిజం దాచాలని కార్తీక్ చెప్తాడు. అదే సమయంలో గదిలో ఉన్న సుమిత్రకి దగ్గు వస్తుంది. దగ్గు ఎక్కువ అవ్వడంతో సుమిత్ర పైనుండి కిందకి వస్తుంటుంది. ఇక కళ్ళు తిరిగి పడిపోతుంటే అప్పుడే దీప వచ్చి సుమిత్రని పట్టుకుంటుంది.

నిన్ను రూమ్ లోనే ఉండమన్నాను కదా అని సుమిత్రని దశరథ్ అంటాడు. దగ్గు వచ్చింది.. కళ్ళు తెరిచి చూస్తే కళ్ళు కనపడటం లేదు.. అందుకే కిందకి వచ్చానని సుమిత్ర చెప్తుంది. అత్తని హాస్పిటల్ కి తీసుకెళ్దామని కార్తీక్ అనగానే నన్నెందుకు హాస్పిటల్ కి తీసుకెళ్ళడమని సుమిత్ర అంటుంది. వెళ్తే మంచిది కదా అని శివన్నారాయణ అంటాడు. కళ్ళు కనపడట్లేదని అంటున్నావ్ కదా హాస్పిటల్ కి వెళ్తే డాక్టర్ చెక్ చేస్తాడని పారిజాతం అంటుంది. దగ్గు వస్తుందని అంటున్నావ్ కదా హాస్పిటల్ కి వెళ్తే చెక్ చేస్తారని కార్తీక్ అంటాడు. అసలు ఏం జరిగిందిరా నాకు ఎందుకు హాస్పిటల్ అంటున్నారు.. టెస్ట్ లు అంటున్నారు.. నిజం చెప్పండి అని సుమిత్ర అందరిని అడుగుతుంది కానీ ఎవరు చెప్పరు. నువ్వు నా కూతురివి కదా.. నా మీద ఒట్టేసి చెప్పు అని జ్యోత్స్న చేతిని తలమీద వేసుకొని అడుగుతుంది. దాంతో అందరు షాక్ అవుతారు. కార్తీక్ ఏదో చెప్పబోతుంటే.. మీరు ఎవరు మాట్లాడిన నేను చచ్చినంత ఒట్టే అని సుమిత్ర అంటుంది. ఇక చేసేదేమీ లేక జ్యోత్స్న నిజం చెప్తుంది. మీకు బ్లడ్ క్యాన్సర్ మమ్మీ అని జ్యోత్స్న అనగానే సుమిత్ర షాక్ అవుతుంది. వెంటనే కూర్చుండిపోతుంది. దగ్గు వచ్చి బ్లడ్ వాంథింగ్ చేసుకుంటుంది సుమిత్ర. అది చూసి అందరు షాక్ అవుతారు. నాకు బ్లడ్ క్యాన్సర్.. అంటే నేను చనిపోతానని సుమిత్ర అనగానే కార్తీక్ వెంటనే డాక్టర్ కి కాల్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.