English | Telugu
బిగ్ బాస్ బ్యూటీకి పెళ్ళి అవసరం లేదంట!
Updated : Sep 28, 2023
శ్రీసత్య ఇప్పుడు సోషల్ మీడియా నీ షేక్ చేస్తున్న బ్యూటీ నిన్న మొన్నటి వరకు తమ బిబి ఫ్రెండ్స్ వాసంతి కృష్ణన్, గీతు రాయల్ తో కలిసి విదేశాలకి వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చింది. ఉన్నది ఒక్కటే జిందగి అంటూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ వస్తుంది ఈ అమ్మడు. తనని బిగ్ బాస్ సీజన్-6 లో 'బ్యూటీ క్వీన్' అని చెప్తారు. మొన్న జరిగిన శ్రీసత్య పుట్టినరోజుని బిగ్ బాస్ స్నేహితులు అందరు కలిసి గ్రాంఢ్ గా సెలబ్రేట్ చేశారు. కంటెస్టెంట్స్ దాదాపుగా అందరు వచ్చి సందడి చేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అర్జున్ కళ్యాణ్ తో లవ్ ట్రాక్ నడిపిన శ్రీసత్య.. ఆ తర్వాత రేవంత్, శ్రీహాన్ లతో కలిసి స్నేహం పేరుతో గ్రూప్ గా ఆడింది. హౌజ్ లో ఫ్యామిలీ వీక్ ముందు వరకు శ్రీసత్య ఖచ్చితంగా వెళ్ళిపోతుందనుకున్నారంతా కానీ ఫ్యామిలీ వీక్ లో వాళ్ళ అమ్మనాన్న రావడంతో ఒక్కసారిగా అంచనాలు మారిపోయాయి. తనకున్న నెగెటివ్ టాక్ కాస్త అమ్మ సెంటిమెంట్ తో పాజిటివ్ అయిపోయింది. ఇక ఆ తర్వాత ఎక్కువ రోజులు ఉన్న శ్రీసత్య ఫైనల్ కి వారం ముందు ఎలిమినేట్ అయి బయటకి వచ్చింది.
ఆ తర్వాత బిబి జోడి డ్యాన్స్ షోలో శ్రీసత్యతో కలిసి మెహబూబ్ డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే మెహబూబ్ ఈ సెలబ్రేషన్స్ లో తన డ్యాన్స్ స్టెప్స్ తో ఫుల్ జోష్ గా కనిపించాడు. శ్రీసత్య కూడా చిందులు వేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ లో ఉన్న బ్యూటి శ్రీసత్య. శ్రీసత్య తన తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్ వాసంతిని ఎప్పుడు కలుస్తూనే ఉంటుంది. బిగ్ బాస్ సీజన్-6 లో గ్లామర్ క్వీన్ గా బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
శ్రీసత్య తన ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా ఫోటోలు, రీల్స్ తో బిజీగా ఉంటుంది. ఎప్పుడు తనకున్న ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది. తాజాగా తను 'ఆస్క్ మీ క్వశ్చనింగ్' స్టార్ట్ చేసింది శ్రీసత్య. మీ ఫోన్ గ్యాలరీలోని ఫోటోని అప్లోడ్ చేయండని అడుగగా.. తన ఫోటోని అప్లోడ్ చేసింది శ్రీసత్య. మీ పెళ్ళి ఎప్పుడని ఒకతను అడుగగా.. ఇప్పట్లో పెళ్ళి చేసుకోనని, భవిష్యత్తులో కూడా పెళ్ళి చేసుకోనని శ్రీసత్య అంది. మీరు జీ తెలుగుకి ఎప్పుడు వస్తారని ఒకరు అడుగగా.. త్వరలోనే వస్తానని శ్రీసత్య అంది. బిబి హౌజ్ లో ఉన్నప్పుడు రాపోని మిస్ అయ్యారా అని అడుగగా.. అవునని చెప్పింది. మీ ఎక్స్ కి పెళ్ళి అయిందంట కదా ఎలా ఫీల్ అవుతున్నారని ఒకరు అడుగగా.. అవును ఫీల్ అవుతున్నాను, పాపం ఆ అమ్మాయి అని సానుభూతిని తెలియజేసింది శ్రీసత్య. విజయవాడలో మీ ఫేవరెట్ ఫుడ్ ఎక్కడ తిన్నారని ఒకతను అడుగగా.. విజయవాడలోని గాంధీనగర్ లో ఒక పంజాబీ దాబా ఉంటుంది. అందులో చికెన్ రోస్ట్ బాగుంటుందని శ్రీసత్య అంది. ఇలా తన అభిప్రాయలని ప్రేక్షకులకి పంచుకుంది ఈ బిగ్ బాస్ బ్యూటీ.