English | Telugu

షాకింగ్ ఓటింగ్స్... ప్రియాంక ఎలిమినేషన్ పక్కా!

బిగ్ బాస్ హౌజ్ లో ఒక్కో కంటెస్టెంట్ పర్ఫామెన్స్ ని బట్టి నామినేషన్లో ఉన్నవారికి ప్రేక్షకులు ఓట్లు వేస్తున్నారు. మొదటి వారం నుండి యాక్టివ్ గా ఉంటూ ఒంటరి పోరాటం చేస్తున్న ప్రిన్స్ యావర్ కి ఓట్ల వర్షం కురుస్తుంది. ది బెస్ట్ గేమ్ ఛేంజర్ గతవారం ఎక్కువ బ్యాడ్జ్ లు తీసుకున్నాడు ప్రిన్స్ యావర్‌. అత్యధిక ఓటింగ్ తో మొదటి స్థానంలో ఉన్నాడు యావర్. రెండవ స్థానంలో శుభశ్రీ రాయగురు ఉంది. చివరి స్థానంలో ప్రియాంక జైన్ ఉంది. నెగెటివ్ మాటలతో అందరి ముందు బ్యాడ్ అయింది ప్రియాంక జైన్.

గతవారం హోస్ట్ నాగార్జున అందరి ముందు ప్రియాంక జైన్ ని.. ఒపినీయన్ మార్చుకోవచ్చా అని ఎందుకు రిక్వెస్ట్ చేశావని అడుగుతాడు. దానికి ప్రియాంక జైన్ చెప్పిన సిల్లీ రీజన్ సరిపోలేదు. తను యాక్టింగ్ చేస్తుందని, మోసం చేసి గెలవాలనుకుందని, మాస్క్ వేసుకుందని స్పష్టంగా తెలుస్తుంది. దీంతో తనకి నెగెటివిటి పెరిగింది. ఓట్లు భారీగా తగ్గాయి. ఇక హౌజ్ లో కంటెంట్ కోసం రోజు రోజుకి దిగజారుతున్న రతిక కూడా ప్రియాంక జైన్ కంటే స్వల్ప తేడాలో ఉంది. అయితే సీరియల్ బ్యాచ్ లోని అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, ఆట సందీప్ అంత కలిసి ఆడుతున్నారని స్పష్టంగా తెలుస్తుంది. నిన్నటి బిబి కాయిన్స్ టాస్క్ లో ప్రియాంక జైన్ కి అత్యధిక బిబి కాయిన్స్ ఇచ్చింది శోభా శెట్టి. అయితే శోభా శెట్టి దగ్గరికి పల్లవి ప్రశాంత్ వచ్చి ఎంతో రిక్వెస్ట్ చేస్తే.. అయిదు కాయిన్లు ఇచ్చింది. మరి ఇన్నేనా అక్కా అని పల్లవి ప్రశాంత్ అంటే.. ఇచ్చినవాటికి కనీసం థాంక్స్ చెప్పకుండా ఇంతేనా అంటావా అని ఆ ఇచ్చిన అయిదు కాయిన్లు తీసుకుంది శోభా శెట్టి. ఇక అమర్ దీప్, టేస్టీ తేజలకి శోభా శెట్టి, ఆట సందీప్ ఎక్కువ కాయిన్లు ఇచ్చారు. దీన్ని బట్టి వీళ్ళ బ్యాచ్ లోని వారే గెలవాలని కావాలని చేస్తున్నారని బిగ్ బాస్ ప్రేక్షకులకు స్వష్టంగా తెలుస్తుంది. అయితే వీళ్ళ ప్రవర్తన కారణంగానే ప్రియాంక జైన్ కి స్వల్ప ఓట్లు పడుతున్నాయడంలో ఆశ్చర్యం లేదు.

ప్రిన్స్ యావర్, శుభశ్రీ ఇద్దరు ఇండివిడ్యువల్ గేమ్ తో ఆకట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళ పర్ఫామెన్స్ కి ప్రేక్షకులు సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక రతిక ఏం చేసిన అది నెగెటివ్ గానే అవుతుంది. ప్రతీసారీ పల్లవి ప్రశాంత్ ని అడ్డుపెట్టుకొని కంటెంట్ కోసం చేస్తుందని ప్రేక్షకులకి ఇప్పటికే అర్థమైంది. మరి ఈ వారం నామినేషన్లో ఉన్న ఆరుగురిలో.. ఓటింగ్ లో ఫస్ట్ యావర్, చివరి స్థానంలో ప్రియాంక జైన్ ఉంది. ఓటింగ్ కి ఇంకా రెండు రోజులే ఉండటంతో, ఈ ఓటింగ్ ఇలాగే కొనసాగితే సీరియల్ బ్యాచ్ లోని ప్రియాంక జైన్ అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందేనంటున్నారు నెటిజన్లు. ఈ సీజన్-7 ఉల్టా పల్టా థీమ్ తో ఆకట్టుకుంటున్న విషయం తెలసిందే. లాస్ట్ మినట్ లో కంటెంట్ కోసం తనని ఎలిమినేట్ కాకుండా ఆపేసిన ఆపేస్తారేమో చూడాలి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.