English | Telugu
హిమ కోసం ప్రేమ్..నిరుపమ్ కారులో శౌర్య దర్జా!
Updated : Jul 20, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `కార్తిక దీపం`. గత కొంత కాలంగా ఫ్యామిలీ డ్రామాగా ప్రసారం అవుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. బుధవారం ఎపిసోడ్ ఎలాంటి మలుపులు తిరగబోతోందన్నది ఇప్పుడు చూద్దాం. ప్రేమ్ కు ఫోన్ చేసిన హిమ ఇంట్లో బోనాల పండుగ జరుపుకుంటున్నారు నువ్వు, నిరుపమ్ బావ రావాలి అని చెబుతుంది. కట్ చేస్తే.. నిరుపమ్, ప్రేమ్ కలిసి సౌందర్య ఇంటికి కారులో బయలుదేరతారు.
ఇదిలా వుంటే సౌందర్య ఫ్యామిలీ అంతా బోనాలకు పయనమవుతారు. అయితే శౌర్య మాత్రం నేను ఆటోలో వస్తాను మీరు కారులో వెళ్లండి అని చెబుతుంది. దీంతో శౌర్య బోనం సమర్పించే వరకు నేను చెప్పినట్టుగా విను..ఆ తరురవాత నువ్వు చెప్పినట్టుగా నేను వింటానని సౌందర్య అంటుంది. శౌర్య సరే అంటుంది. ఆ తరువాత సౌందర్య వాళ్లు కారులో ముందు పక్క కూర్చోగా హిమ వెనకాల కూర్చోవాలని ప్రయత్నిస్తుంది. ఇదే సమయంలో శౌర్యని కూడా వెనకాలే కూర్చునేలా చేస్తుంది సౌందర్య. ఆ తరువాత కార్ తను డ్రైవ్ చేస్తూ ఇద్దరిని కలపడానికి కట్ లు కొడుతూ ఒకరిపై ఒకరు పడేలా చేస్తుంది.
కట్ చేస్తే.. సౌందర్య కుటుంబం అంతా కలిసి షాపింగ్ చేస్తారు. అంతా బయటికి వచ్చాక అక్కడికి వచ్చిన ప్రేమ్ వెళ్లి సౌందర్య కారులో వున్న హిమ పక్కన కూర్చుంటాడు. దీంతో శౌర్య .. నిరుపమ్ కార్ లో కూర్చుంటుంది. అంతా కలిసి సరదాగా బయటకు వెళదాం అని సౌందర్యతో ప్రేమ్ అంటాడు. తన ఇష్టం ప్రకారమే అంతా బయటికి వెళతారు. ఇదే సమయంలో నిరుపమ్ కార్ లో కూర్చున్న శౌర్య దర్జాగా చూపిస్తుంది. అది చూసిన నిరుపమ్ ఎలా రియాక్ట్ అయ్యాడు? .. ఇద్దరి మధ్య ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.