English | Telugu
వీజే సన్నీకి క్షమాపణ చెప్పిన విశ్వా
Updated : Jul 20, 2022
సీరియల్ యాక్టర్ గా విశ్వకు పెద్ద పేరు లేదు కానీ బిగ్ బాస్ సీజన్ 5 కి వెళ్లి వచ్చాక ఆయన్ని అందరూ గుర్తించడం మొదలు పెట్టారు. ఐతే ఇప్పుడు మాక్సిమం సెలెబ్స్ అంతా కూడా ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటున్నారు. ఇక ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లు పెడుతూ ఇంకా పాపులర్ అవుతున్నారు. ఇప్పుడు విశ్వా కూడా అంతే. అభిమానులతో సరదాగా ఇన్స్టా స్టేటస్ వేదికగా ఇంటరాక్ట్ అయ్యాడు. ఇక ఇందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎన్నో ఇంటరెస్టింగ్ ఆన్సర్స్ కూడా చెప్పాడు. విశ్వా ఎవరికైనా క్షమాపణ చెప్పాలనుకుంటే అది ఎవరికీ ? అని అడిగిన ప్రశ్నకు "@iamvjsunny " అని ఆన్సర్ ఇచ్చాడు. సన్నీకి ఎందుకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాడో మాత్రం చెప్పలేదు. అలాగే బిగ్ బాస్ లో ఏ కంటెస్టెంట్ అంటే ఇష్టం అని మరో అభిమాని అడిగిన ప్రశ్నకు రాహుల్ సిప్లిగంజ్ అని ఆన్సర్ ఇచ్చాడు. అభిమానుల ప్రశ్నల్లో ఇంకో ముఖ్యమైనది "మళ్ళీ ఛాన్స్ వస్తే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారా ? " అని అడిగేసరికి థంబ్స్ అప్ ఎమోజి పెట్టి తన అంగీకారాన్ని ప్రకటించాడు.
మీరు మీ బిగ్ బాస్ ఫ్రెండ్స్ ని మిస్ అవుతున్నారా అని అడిగేసరికి కాదు బిగ్ బాస్ హౌస్ ని మిస్ అవుతున్న అంటూ సరదాగా ఆన్సర్ చేసాడు. ఇక తన నిక్ నేమ్ రాజు అని చెప్పాడు. అఖిల్ సార్థక్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే లవింగ్ పర్సన్ అని చెప్పాడు. విశ్వా స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ కి సుపరిచితమే. ఫేమస్ షోస్ ఐన యువ, గంగతో రాంబాబు, గంగ మంగలో యాక్ట్ చేసాడు. అలాగే డాన్స్ జోడి డాన్స్ వంటి షోస్ లో కూడా కనిపించాడు. నాగ చైతన్య మూవీ జోష్ లో కూడా విశ్వా నటించాడు. 2002 లో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు విశ్వా. అతను నటించిన పెళ్లి కోసం అనే మూవీ 2004 లో రిలీజ్ అయ్యింది. ఇక అదే ఏడాదిలో విద్యార్థి మూవీ రిలీజ్ అయ్యి మంచి పేరు తెచ్చిపెట్టింది విశ్వకి.