English | Telugu
స్త్రీలపై అసభ్యకర డైలాగ్స్‌తో పంచ్‌లేసిన ఆది!
Updated : Jul 20, 2022
హైపర్ ఆది పంచులకుపెట్టింది పేరు. జబర్దస్త్ నుంచి కెరీర్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అన్ని షోస్ లో తన హవా కొనసాగిస్తున్నాడు. స్పాంటేనియస్ గా పంచులు పేల్చడంలో ఆది దిట్ట. తర్వాత జబర్దస్త్ వదిలేసి 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు. మొన్నటి జోడి ఎపిసోడ్ లో ఆది కొంత టూమచ్ గా బిహేవ్ చేసి మహిళల మీద కించపరిచే డైలాగ్స్ వేసి షోని నడిపించాడు.
"అందరికీ జోడీలను ఇచ్చారు, నాకు ఎందుకు ఇవ్వలేదు?" అని బులెట్ భాస్కర్ అనేసరికి, "నీకోసం ఏ జోడీని తీసుకురావాలో తెలీక కంఫ్యూజన్ లో తేలేదు.. దానికి మేమేం చేయాలి?" అన్నాడు ఆది. ఇలా జోడి టీమ్స్ మీద పంచ్‌ల వర్షం కురిపించాడు. ఇక పరదేశి మీద కూడా అదే తరహాలో కౌంటర్లు ఇచ్చాడు.
పరదేశి తనకు జోడీగా ఐశ్వర్యను తీసుకొచ్చాడు. "ఐశ్వర్యతో నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసా, ఫ్యూచర్ లో ఆమె ఎక్కడికి వెళ్తుందో తెలుసా?" అంటూ ఆమె గురించి కొంచెం ఎక్కువగా పొగుడుతూ ఉండేసరికి ఆది అడ్డుపడ్డాడు. "అసలు దానికి ఫ్యూచర్ ఉందా?" అని అతను అనేసరికి అందరూ నవ్వేశారు.
ఐశ్వర్య మాత్రం షాక్ అయ్యింది. అలా పరదేశి జోడీ పరువు తీసేశాడు ఆది. ఐశ్వర్యను ఆటో రాంప్రసాద్ తీసుకెళ్లబోతే, "ఆమె నా జోడీ. నువ్వెందుకు పక్కకు తీసుకెళ్తున్నావ్?" అని అడిగాడు పరదేశి. "నువ్వైనా పక్కకే కదా తీసుకెళ్లేది" అంటూ ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ వేశాడు. ఇలా గత వారం మహిళలను కించపరిచే అభ్యంతరకరమైన డైలాగ్స్ తో షో నడిచింది.