English | Telugu

సోనియా కుళ్ళు.. నిఖిల్ కన్నీళ్ళు.. ఇదేం పత్తాపారం సామి!

బిగ్ బాస్ హౌస్ లో ఒక్కొ కంటెస్టెంట్ బిహేవియర్ కి బయట ఉన్న వాళ్ళకి మైండ్ పోతుంది. నిన్న మొన్నటిదాకా సోనియా, నిఖిల్ రాసుకొని తిరిగారు‌. నిన్నటి ఎపిసోడ్ లో దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యారని చెప్పుకున్నారు.

అసలేం జరిగిందంటే.. హౌస్ లోని కంటెస్టెంట్స్ కి ఫుడ్ లేకుండా బిగ్ బాస్ అన్నీ లాగేసుకుంటే.. నిఖిల్ వాళ్ళకి ఫుడ్ లేదని సోనియా ఏడ్చేసింది. అయితే తను ఏడ్చిందానికి అసలు రీజన్ అదేనా అంటే కాదనే అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్, సోనియా మట్లాడింది టెలి కాస్ట్ చేశాడు బిగ్ బాస్. అందులో ఏం ఉందంటే.. నా వల్ల నీ గేమ్ డిస్టబ్ అవుతుందంటే నాతో నువ్వు ఉండకు.. నేను నీతో ఉండను అని సోనియాతో నిఖిల్ చెప్తాడు. ఆ తర్వాత హౌస్ లో ఫుడ్ కోసం ప్రతీ క్లాన్ నుండి ఒక్కొక్కరిని తీసుకొని గేమ్ ఆడించాడు‌ బిగ్ బాస్.

ఈ టాస్క్ లల్లో గెలిచిన వారికే ఫుడ్ అని చెప్పడంతో అందరు పోటీపడి ఆడారు. ముందుగా యష్మీ టీమ్ గెలిచి రేషన్‌ను సొంతం చేసుకున్న వెంటనే సోనియా తెగ ఏడ్చేసింది. ఇంతకు గెలిచింది వాళ్ల టీమ్ ఏ అయినా సోనియా ఎందుకేడుస్తుందో ఎవరికి అర్థం కాలేదు. కానీ దానితో మనకేం సంబంధం ఓదార్పు ఇవ్వడమే ముఖ్యం అన్నట్లు వెంటనే సోనియాను దగ్గరికి తీసుకొని అభయ్ నవీన్ ఓదార్చాడు. ఇక సోనియా ఏడుస్తుందని తెలియగానే పరిగెత్తుకొని వచ్చాడు సోనియా ప్రేమికుడు నిఖిల్. కానీ ఏం లేదు.. ఏం లేదు అంటూ నిఖిల్‌ని పక్కకి పంపేసి మరీ అభయ్ ఓదార్చాడు. ఇక తర్వాత నిఖిల్ కూడా కాసేపు ఓదార్చాడు.. తర్వాత పృథ్వీ కూడా సోనియాను ఓదార్చాడు. ఇలా ఎంతమంది ఓదార్చిన సోనియా కన్నీళ్ళు ఆగలేదు. ఆ తర్వాత నిఖిల్ కూడా కాస్త ఎమోషనల్ అయ్యాడు. మణికంఠ ఫుడ్ దొంగతనం చేద్దామని చెప్పిన నా వల్ల కాదని చెప్పేశాడు. మరి వీరి మధ్య ఏం జరుగుతుందో బిబి(Biggboss) ఆడియన్స్ కే తెలుస్తుంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.