English | Telugu

`కామెడీ స్టార్స్`లో థ‌ర్డ్ వేవ్ క‌ల‌క‌లం!

ప్ర‌తీ ఆదివారం హాస్యప్రియుల్ని క‌డుపుబ్బా న‌వ్విస్తున్న కామెడీ షో `కామెడీస్టార్స్‌`. `స్టార్ మా`లో గ‌త కొన్ని వారాలుగా ప్ర‌సారం అవుతున్న ఈ షో బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఓంకార్ స‌మ‌ర్పిస్తున్న ఈ షోకి శేఖ‌ర్ మాస్ట‌ర్‌, హీరోయిన్ శ్రీ‌దేవి జ‌డ్జెస్ గా వ్య‌వ‌హ‌రించేవారు కానీ సీజ‌న్ మారింది. శ్రీ‌దేవి స్థానంలో మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు జ‌డ్జ్ గా వ‌చ్చేశారు. అదే స‌మ‌యంలో ఈ షోలోకి అదిరే అభి అండ్ టీమ్ కూడా ఎంట్రీ ఇచ్చేసింది.

Also read:సుడిగాలి సుధీర్‌కి ర‌ష్మీ స్ట్రాంగ్ వార్నింగ్!

ఈ ఆదివారం అదిరే అభి టీమ్ హంగామా చేయ‌బోతున్నారు. ఈ టీమ్ ప్ర‌త్యేకంగా చేసిన స్కిట్ న‌వ్వులు పూయించ‌బోతోంది. ఇందుకు సంబంధించిన తాజా ప్రోమోని రిలీజ్ చేశారు. `సౌత్ ఆఫ్రికాలో సాఫ్ట్ వేర్‌` అనే కాన్సెప్ట్ తో ఈ ఆదివారం అదిరే అభి టీమ్ చేసే హంగామా ఓ రేంజ్ లో వుండ‌బోతోంది. సౌత్ ఆఫ్రికా నుంచి వ‌చ్చిన సాఫ్ట్ వేర్ హంగామాతో అదిరే అభి టీమ్ న‌వ్వులు పూయించ‌బోతోంది. ఇదే సంద‌ర్భంగా సౌత్ ఆఫ్రికాలో థ‌ర్డ్ వేవ్ అంటూ వీళ్లు చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

Also read:వంట‌ల‌క్క మ‌రిదిని బుట్ట‌లో వేసిన మోనిత‌

ఇంత‌కీ థ‌ర్డ్ వేవ్ సృష్టించిన క‌ల‌క‌లం ఏంటీ? వైర‌స్ రాకుండా సౌత్ ఆఫ్రికా సాఫ్ట్ వేర్‌కి అదిరే అభి క్రియేట్ చేసిన డ్రెస్ ఏంటీ? .. అది వైర‌స్ నుంచి అత‌న్ని ఎలా కాపాడింది? .. ఈ క్ర‌మంలో అదిరే అభి టీమ్ చేసిన ర‌చ్చ ఏంటీ అన్న‌ది చూడాలంటే ఈ ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు ప్ర‌సారం కానున్న కామెడీ స్టార్స్ చూడాల్సిందే. ప్రోమో చివర్లో హ‌రిపై యాద‌మ్మ రాజు వేసిన పంచ్ న‌వ్వులు పూయిస్తోంది. ఈ షోకి నాగ‌బాబు, శేఖ‌ర్ మాస్ట‌ర్ జ‌డ్జ్‌లుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా.. శ్రీ‌ముఖి హోస్ట్ గా ఆక‌ట్టుకుంటోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.