English | Telugu

నవ్య స్వామి క్ష‌మించ‌మంటోంది ఎందుకు?  

బుల్లితెర తార‌ల్లో న‌వ్య స్వామికి ఉన్న పాపులారిటీ వేరే రేంజ్‌. `ఆమె క‌థ‌` సీరియ‌ల్ తో న‌వ్యస్వామి మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. ఇదే సీరియ‌ల్ ద్వారా న‌వ్యస్వామికి, ర‌వికృష్ణ‌కు మధ్య మంచి స్నేహం ఏర్ప‌డిన విష‌యం తెలిసిదే. ఈ జోడీ మ‌ధ్య కెమిప్ట్రీ బాగా కుద‌ర‌డంతో ఇద్ద‌రిపై చాలా రూమ‌ర్లు వ‌చ్చాయి. ఆ రూమ‌ర్ ల‌కు త‌గ్గ‌ట్టే బ‌య‌ట కూడా వీరిద్ద‌రు బాగా క్లోజ్‌గా క‌నిపించ‌డంతో ఈ జంట బాగుందంటూ ఆడియ‌న్స్ కామెంట్ లు చేశారు.

Also read:బాల‌య్యా మ‌జాకా.. రానాని ఆడేసుకున్నాడుగా!

బుల్లితెర‌పై మ్యాజిక్ చేసిన ఈ జంట ప్ర‌తీ షోలోలో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా ప్ర‌తీ ఈవెంట్ లోనూ ఇద్ద‌రు క‌లిస్తే ర‌చ్చ మామూలుగా వుండేది కాదు. ఈ ఇద్ద‌రిపై వ‌స్తున్న రూమ‌ర్ ల‌కు ర‌వికృష్ణ ఓ షో సాక్షిగా ఆజ్యం పోశాడు. టీవీ రియాలిటీ షోలోనే న‌వ్యస్వామికి ఏకంగా ముద్దు పెట్టేయ‌డం అప్ప‌ట్లో హాట్ టాపిక్ గా మారింది. `ఆమె క‌థ‌` సీరియ‌ల్ స‌మ‌యంలో న‌వ్యస్వామికి కోవిడ్ సోక‌డం... ఆ త‌రువాత ర‌వికృష్ణ‌కు సోక‌డంతో ఇద్ద‌రూ చాలా ఇబ్బందులు ప‌డ్డారు.

Also read:సిరి, ష‌ణ్ణు తెలిసే చేశారు.. మాన‌స్ బ‌య‌ట‌పెట్టేశాడు!

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా న‌వ్య స్వామి త‌న అభిమానుల‌ని ఉద్దేశించి సోష‌ల్ మీడియా వేదిక‌గా పెట్టిన పోస్ట్ ఆక‌ట్టుకుంటోంది. ఈ కొత్త ఏడాదిలోకి క్లీన్ మైండ్‌, హార్ట్ తో అడుగుపెడుతున్నాన‌ని చెప్పుకొచ్చింది. గ‌త ఏడాది త‌న‌కు బాగా గ‌డిచింద‌ని చెప్పిన న‌వ్య ఈ విష‌యంలో మీరు నాకు రుణ‌పడి వుంటే దాని గురించి మ‌ర్చిపోండ‌ని, అయితే మీకు నేను అన్యాయం చేశాన‌ని అనిపిస్తే అందుకు నేను మీకు క్ష‌మాప‌ణ‌లు కోరుకుంటున్నాన‌ని తెలిపింది. "అస‌లే ఈ జీవితం చాలా చిన్న‌ది.. పెండింగ్ లో వున్న కోపం, ప‌గ‌లు అద‌న‌పు ఒత్తిడిని వ‌దిలేయండి.. 2022ని ఎంజాయ్ చేయండి" అని త‌న అబిమానుల‌కు తెలిపింది.

" width="400" height="700" layout="responsive">

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.