English | Telugu

శివాజీ క్లాస్ దెబ్బకి గట్టిగా అరిచిన రష్మీ!


జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి "జనక ఐతే గనక" మూవీ టీమ్ వచ్చింది. అలాగే ఈ షోలో సుహాస్ కూడా ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఇక జడ్జ్ గా వచ్చిన శివాజీ ఐతే రష్మీకి తెగ క్లాస్ పీకేసాడు. సుహాస్ స్టేజి మీద రాగానే "ఆడియన్స్ ఈ సినిమా నుంచి ఎం ఆశించవచ్చు" అని రష్మీ అడిగింది. "పిల్లల్ని ఎందుకు లేట్ గా కంటున్నారు..లేట్ గా సెటిల్ అవుతున్నారు" అంటూ ఆన్సర్ ఇచ్చేసరికి ఇక శివాజీ తగులుకున్నాడయ్యో.

శివాజీ క్లాసులు పీకడంలో దిట్ట అని బిగ్ బాస్ లో ఆల్రెడీ చూసి ఉన్నాం కదా. ఇక ఇప్పుడు రష్మీకి ఇచ్చాడు క్లాస్. "సెటిల్ అనే పదానికి చాలామంది కరెక్ట్ మీనింగ్ తెలుసుకోలేకపోతున్నారు. సెటిల్ అంటే అప్పులు లేకుండా ఉండటం. కొంతమందికి ఎంత చెప్పినా వినరు..అర్ధం కాదు. వాళ్ళు అలాగే చేసుకుంటా పోతా ఉంటారు. రష్మీ లాగా" అనేసరికి అప్పటి వరకు చాలా సీరియస్ గా తిలకిస్తున్న రష్మీ ఒక్కసారిగా ఆ పంచ్ తన మీదకు వచ్చేసరికి "హలో" అని గట్టిగా అరిచింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.