English | Telugu

Bigg Boss 9 Telugu : డీమాన్ కి బుద్ధి లేదు.. శ్రష్టి వర్మ బోల్డ్ కామెంట్స్!

బిగ్ బాస్ సీజన్-9 లో నామినేషన్ ప్రక్రియ వరుసగా రెండు రోజులు జరిగింది. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి హౌస్ లోని కంటెస్టెంట్స్ ని నామినేట్ చేశారు. దీంతో వీరి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. నిన్న జరిగిన ఎపిసోడ్ లో మొదటి వారమే ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన శ్రష్టి వర్మ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తను హౌస్ లోకి వెళ్ళగానే రాము ఎదురుగా వచ్చి హగ్ చేసుకున్నాడు.

శ్రష్టి తన మొదటి నామినేషన్ డీమాన్ పవన్ ని చేసింది. నీకు కండ బలం ఉంది కానీ బుద్ధి బలం లేదని శ్రష్టి అంటుంది. నీకు టాస్క్ లో ఎక్కడ బుద్ధి బలం లేదని అనిపించిందని శ్రష్టి ని డీమాన్ అడుగుతాడు. నీకు ఏదైనా చెప్తే అందరిని ఇలాగే అడుగుతావు .. ఫస్ట్ నీకు ఏ విషయంపై క్లారిటీ లేదని శ్రష్టి అంటుంది. రీతూకి ప్రతీ విషయంలో క్లారిటీ గా ఉందని శ్రష్టి అంటుంది. వీరి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ఇక ఆ తర్వాత సెకెండ్ నామినేషన్ కి రాముకి ఛాన్స్ ఇస్తుంది శ్రష్టి.

గౌరవ్ ని రాము నామినేట్ చేస్తాడు. కెప్టెన్ గా ఇద్దరున్నారు.. ఇద్దరిది బాధ్యత కానీ సుమన్ అన్న ఏం చేయడం లేదని ఫీల్ అయ్యావ్.. ఏదైనా గొడవ జరిగితే ఆడవాళ్ళ మధ్యలోకి వెళ్ళనని చెప్పావ్ కానీ కెప్టెన్ అన్నప్పుడు నీ బాధ్యతలు కూడా ఉంటాయని రాము అనగానే గౌరవ్ షాక్ అవుతాడు. నామినేషన్ అయ్యాక ఒక నిన్ను మాత్రమే ఫ్రెండ్ అని ట్రస్ట్ చేశాను.. ఇక హౌస్ లో ఎలాంటి బాండ్ లేదు.. ఎవరిని ట్రస్ట్ చెయ్యొద్దని రాముతో గౌరవ్ అంటాడు. ఇప్పటివరకు రాము, గౌరవ్ కలిసి ఉండేవారు.. ఈ నామినేషన్ తో వీరిమధ్య దూరం పెరిగింది. వీకెండ్ ఎపిసోడ్ లో వీరిద్దరిలో ఎవరు కరెక్ట్ అని నాగార్జున చెప్తారో లేదో చూడాలి మరి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.