English | Telugu

షాకింగ్ ట్విస్ట్ .. టాప్ 5 లోకి ఆ ఇద్ద‌రు ఎంట్రీ?

బిగ్‌బాస్ సీజ‌న్ 5లో హౌస్‌లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్‌లు అడుగుపెట్టారు. అయితే ఇప్పుడు వారి సంఖ్య 7కు ప‌డిపోయింది. తాజాగా 13వ వారం నామినేష‌న్స్‌లో ఇద్ద‌రు స‌భ్యులు స‌న్నీ, ష‌ణ్ముఖ్ మిన‌హా సిరి, మాన‌స్‌, ప్రియాంక‌, శ్రీ‌రామ‌చంద్ర‌, కాజ‌ల్ వున్నారు. 12వ వారం అనూహ్యంగా యాంక‌ర్ ర‌వి ఎలిమినేట్ కావ‌డంతో హౌస్‌లో 7 గురు స‌భ్యులు మిగిలిపోయారు. దీంతో బిగ్‌బాస్ చివ‌రి అంకంలోకి వ‌చ్చేసింది. త్వ‌ర‌లో షో ముగియ‌బోతున్న నేప‌థ్యంలో టాప్ 5లో ఎవ‌రుంటారు? టైటిల్ ఫేవ‌రేట్ ఎవ‌రు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

దానికి తోడు ఈ 13వ వారం ఇంట్లో వున్న స‌బ్యుల్లో స‌న్నీ, ష‌న్ను మిన‌హా మాన‌స్‌, శ్రీ‌రామ‌చంద్ర‌, సిరి, ప్రియాంక‌, కాజ‌ల్ నామినేష‌న్స్‌లో వుండ‌టం గ‌మ‌నార్హం. దీంతో టిక్కెట్ టు ఫినాలేలో భాగంగా టాప్ ఫైకి నేరుగా ఇద్ద‌రు స‌భ్యులు స‌న్నీ, ష‌ణ్ముఖ్ నామినేట్ అయిన‌ట్టుగా తెలుస్తోంది. ఇక నామినేష‌న్స్‌లో వున్న వాళ్ల‌లో సిరి, ప్రియాంక అత్యంత డేంజ‌ర్ జోన్‌లో వున్న‌ట్టుగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. అందులోనూ ప్రియాంక‌కు మ‌రీ అత్యల్పంగా ఓట్లు వ‌చ్చిన‌ట్టుగా చెబుతున్నారు.

గ‌త కొన్ని వారాలుగా స‌న్నీ ఓటింగ్ ప‌రంగా.. గేమ్ ప‌రంగా త‌న ఆదిప‌త్యాన్నికొన‌సాగిస్తున్నాడు. ష‌ణ్ముఖ్‌ని మించి ఓటింగ్‌ని సాధించ‌డ‌మే కాకుండా గేమ్ ప‌రంగానే స‌న్నీది పై చేయి వుండ‌టంతో అత‌ను నంబ‌ర్ వ‌న్ స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇదే ప‌రిస్థితి కంటిన్యూ అయితే టైటిల్ విజేత ఎవ‌ర‌న్న‌ది ఆలోచించ‌డం పెద్ద క‌ష్ట‌మైన ప‌నేమీ కాద‌ని నెట్టింట చ‌ర్చ న‌డుస్తోంది. టాప్ 5 విష‌యానికి వ‌స్తే స‌న్ని, ష‌ణ్ముఖ్‌ల త‌రువాత శ్రీ‌రామ‌చంద్ర నిల‌వ‌నున్నాడు.

ఆ త‌రువాత స్థానాన్ని అంటే 4వ స్థానాన్ని కాజ‌ల్ ఆక్ర‌మించిన‌ట్టుగా చెబుతున్నారు. ఇక ఐద‌వ స్థానంలో మాన‌స్ నిలిచే అవ‌కాశం క‌నిపిస్తోంది. సిరి .. ష‌న్నుతో హ‌గ్గుల‌కే కాలాన్ని క‌రిగించేయ‌డంతో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ దారుణంగా ప‌డిపోయింది. ఇదే మాన‌స్‌ని 5వ స్థానంలో నిల‌బెట్టేలా చేసింద‌ని టాక్‌. గురువారం హౌస్‌లో ఏం జ‌ర‌గ‌బోతోంద‌న్న‌ది తెలియాలంటేఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.