English | Telugu

ఢీ షో లో అవు డాన్స్...ఆది చూస్తుంటే పడిపోతోంది 

ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా హాట్ నెస్ ఓవర్ లోడెడ్ తో ఉంది. ఆది ఇందులో ఒక మెజీషియన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇంకా ఆది ఉంటే వచ్చే బూతులు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్య కుమార్ మాష్టర్ కూడా ఆదికి తోడయ్యాడు. కుమార్ మాష్టర్ ఒక తాడు ఇచ్చి దాన్ని నిలబెట్టమని చెప్పాడు. దాంతో హోస్ట్ నందు మ్యాజిక్ స్టిక్ తీసుకుని ఆ తాడును స్ట్రైట్ గా నిలబెట్టాడు. ఐతే కుమార్ మాష్టర్ మాత్రం ఆది అన్న నువ్వు చూస్తుంటే పడిపోతోంది అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ వేసాడు.

ఇక డాన్సర్ మానసి జోషి ఐతే అద్భుతంగా డాన్స్ చేయడంతో పాటు ఆదికి మాస్ వార్నింగ్ ఇచ్చింది. "రేయ్ ఆది కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా" అంది. చూడబోతే ఆమె కళ్ళు కత్తుల కన్నా పవర్ ఫుల్ గా ఉన్నాయి. ఇక చిట్టి మాష్టర్ డాన్సర్ రాము రాథోడ్ మాత్రం మ్యాజిక్ చేశారు. ఒక ఆవును తీసుకొచ్చి ఒక జానపద పాటను పాడుతూ డాన్స్ చేసి అందరినీ ఎమోషనల్ గా టచ్ చేశారు. "ఆవును తీసుకొచ్చి సాంగ్ లో పెట్టాలన్న ఆలోచన అవుట్ ఆఫ్ ది బాక్స్" అంటూ శేఖర్ మాష్టర్ చిట్టి మాష్టర్ ని పొగిడాడు. ఇక ఈ పాటకు అటు జనులూరితో ఇటు హన్సికతో కలిసి డాన్స్ చేశారు రాము రాథోడ్. ఈ సాంగ్ మాత్రం ఈ ఎపిసోడ్ లో హైలైట్ గ నిలిచింది. జానపదాలు వింటే ఎవరికైనా ఊపొస్తుంది. ఈ సాంగ్ విన్నాక రాము రాథోడ్ కి ఫ్యాన్ ఇపోయానని చెప్పాడు శేఖర్ మాష్టర్.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.