English | Telugu

నువ్వే కావాలి హీరోతో సీరియల్ నటి పెళ్లి!

టాలీవుడ్ లో పెళ్లిళ్ల జాతర జరుగుతోంది. రీసెంట్ గా నటుడు సుబ్బరాజు, హీరో అక్కినేని నాగ చైతన్య వంటి వాళ్ళ వివాహాలు జరిగిపోయాయి. ఇక ఇప్పుడు సింగర్ సాయి కిరణ్ కూడా పెళ్లి చేసేసుకున్నారు. ఈయన ఒకప్పటి టాలీవుడ్ సింగర్ రామకృష్ణ తనయుడు. ఆయన 'నువ్వేకావాలి' సినిమాలో నటించాడు. అలాగే ఆ సినిమాలోని "అనగనగా ఆకాశం ఉంది" అనే పాట పాడి యూత్ ని మస్మోరైజ్ చేసిన నటుడు. ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. ప్రేమించు, దేవి, మనసుంటే చాలు, ఎంత బావుందో, డార్లింగ్ డార్లింగ్ సహా దాదాపు 25 సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చి సీరియల్స్ నటిస్తూ మెప్పిస్తున్నాడు.

ఇక సాయి కిరణ్ కి బ్రేక్ ఇచ్చిన సీరియల్, సోషల్ మీడియాలో సాయికిరణ్ కి మంచి హైప్ తెచ్చిన పాత్ర ఏదైనా ఉంది అంటే అది "గుప్పెడంత మనసు" సీరియల్ . ఇందులో మహేంద్రగా మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగు సీరియ‌ల్స్ ఆర్టిస్టుల్లో ఇప్పుడు టాప్ యాక్ట‌ర్స్‌లో ఎవరైనా ఉన్నారు అంటే అది సాయికిర‌ణ్ మాత్రమే. గుప్పెడంత మ‌న‌సు కంటే ముందు మౌన‌రాగం, ఇంటిగుట్టు, అభిలాష‌, కోయిల‌మ్మ‌, శివ‌లీల‌లు, వెంక‌టేశ్వ‌ర వైభ‌వంతో పాటు ప‌లు టీవీ సీరియ‌ల్స్‌లో కీల‌క పాత్ర‌లు పోషించాడు. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళ సీరియ‌ల్స్‌లో సాయికిర‌ణ్ న‌టించాడు. కోయిలమ్మ సీరియల్ లో సింగర్ గా నటించాడు. ప్రస్తుతం పడమటి సంధ్య రాగం అనే సీరియల్ లో నటిస్తున్నాడు. అలా వరుస సీరియల్స్ తో బిజీగా ఉన్నాడు సాయి కిరణ్. కెరీర్ పీక్స్ లో ఉన్న ఈ టైములో రెండో వివాహం చేసుకున్నాడు. అది కూడా చాలా సింపుల్ గా జరిగిపోయింది. కోయిలమ్మ సీరియల్ లో వదిన రోల్ లో చేసిన స్రవంతిని పెళ్లి చేసుకున్నాడు.

మొదటి భార్య వైష్ణవితో మ్యూచువల్ డివోర్స్ తీసుకుని కెరీర్ ని బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. తర్వాత కొన్నాళ్ళు ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు తన సహనటిని పెళ్లి చేసుకున్నాడు. తెలుగుతో పాటూ మలయాళం సీరియల్స్ లోనూ నటిస్తున్నాడు సాయికిరణ్. సాయి కిరణ్ ని పెళ్లి చేసుకున్న స్ర‌వంతి.. క‌ళ్యాణం క‌మ‌నీయం, నాగ‌పంచ‌మితో పాటు ప‌లు సీరియ‌ల్స్ నటించింది. కోయిల‌మ్మ సీరియ‌ల్‌లో నటిస్తున్నప్పుడే సాయికిర‌ణ్, స్ర‌వంతి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్పడి ప్రేమ‌గా మారినట్లు తెలుస్తోంది. సాయి కిరణ్.. గోపి, స‌ప్త‌గిరి ఎల్ఎల్‌బీ, న‌క్ష‌త్రంతో పాటు మ‌రికొన్ని సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేశాడు కానీ అంతగా క్లిక్ కాలేదు. వెండితెరపై కన్నా బుల్లితెరపైనే సాయికిరణ్ కి ఎక్కువగా గుర్తింపు వచ్చింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.