English | Telugu

గుడిలో ఆదిత్య‌కు షాకిచ్చిన రుక్మిణి, స‌త్య‌

వెండితెర‌పై `చంటిగాడు` సినిమాతో ఆక‌ట్టుకున్న సుహాసిని ఆ త‌రువాత వెండితెర‌ను వీడి బుల్లితెర‌కు షిఫ్ట్ అయిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న సీరియ‌ల్ `దేవ‌త‌`. అర్జున్ అంబ‌టి, వైష్ణ‌వీ రామిరెడ్డి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా అల‌రిస్తోంది. ప్రారంభం నుంచి ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు తిరుగుతున్న `దేవ‌త‌` సీరియ‌ల్ నేడు స‌రికొత్త ట్విస్ట్‌ల‌తో సాగ‌బోతోంది.

ఈ మంగ‌ళ‌వారం 402వ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతోంది. దీని హైలైట్స్ ఏంటో ఒక‌సారి చూద్దాం. కార్తీక పౌర్ణ‌మి కార‌ణంగా దీపాలు వెలిగించ‌డానికి స‌త్య‌, దేవుడ‌మ్మ సిద్ధ‌మ‌వుతారు. అదే స‌మ‌యంలో రాధ (రుక్మిణి), జాన‌కి, పిల్ల‌లు గుడికి వెల్ల‌డానికి రెడీ అవుతుంటారు. ఇంత‌లో రామ్మూర్తి ఫోన్‌కి ఏదో మెసేజ్ వ‌స్తుంది. ర‌మ్య ఆఫోన్‌ని తీసుకొచ్చి ఏదో మెసేజ్ వ‌చ్చిన‌ట్టుంది చూడు బావా అంటూ మాధ‌వ‌కి ఇస్తుంది. అందులో బుల్లెట్‌పై ఆదిత్య పిల్ల‌ల‌ని తీసుకెళుతూ దిగిన ఫొటోలు క‌నిపిస్తారు. దాంతో మాధ‌వ మూడ్ అప్‌సెట్ అవుతుంది. ఆ ఫొటోల‌ని జాన‌కి, రాధ‌ల‌కు చూపించి `ఆదిత్య పిల్ల‌ల‌తో దిగిన ఫొటోలు చూస్తుంటే నా అవిటిత‌నాన్ని వెక్కిస్తున్న‌ట్టుగా వున్నాయ‌ని` మాధ‌వ మ‌న‌స్తాపానికి గురై అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు.

క‌ట్ చేస్తే జాన‌కి, పిల్ల‌ల‌తో క‌లిసి గుడికి వెళ్లిన రాధ (రుక్మిణి) స‌త్య‌కు క‌నిపిస్తుంది. రుక్మిణిని చూసిన స‌త్య షాక్‌కు గుర‌వుతుంది. అదే స‌మ‌యంలో రుక్మిణిని జానికి రాధ అని పిల‌వ‌డంతో మ‌రింత షాక్‌కు గుర‌వుతుంది. ఇక స‌త్య‌ని గ‌మ‌నించిన రాధ త‌ను క‌నిపించ‌కుండా జాగ్ర‌ప‌డే ప్ర‌య‌త్నం చేస్తుంది. స‌త్య‌కు రాధే రుక్మిణి అని తెలిసిపోయిందా? .. తెలిస్తే స‌త్య ఏం చేసింది? ... క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.