English | Telugu

విష్ణుప్రియ మాటలకి ఏడ్చేసిన రోహిణి.. అతనే కారణమా!

బిగ్ బాస్ సీజన్-8 యమ క్రేజ్ గా సాగుతుంది. హౌస్ లో ప్రేమ పక్షులు ఎవరంటే విష్ణుప్రియ, పృథ్వీ అని చెప్పొచ్చు. విష్ణుప్రియ ఎక్కవగా పృథ్వీతో ఉండడం.. నా మనసులో ఒకరున్నారంటూ ఇండైరెక్ట్ గా చెప్పడం.. ఇదంతా చూస్తుంటే విష్ణుప్రియ కంటెంట్ కోసం చేసినట్లు లేదు.. నిజంగానే ప్రేమలో పడిందా అనే డౌట్ వస్తుంది.

ఇన్ని రోజుల నుండి హౌస్ మేట్స్ కే కాదు ఆదివారం వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ కి కూడా వాళ్లిదరి మధ్య సంథింగ్ సంథింగ్ అని అనుకుంటున్నారు.

రోహిణి దగ్గరికి విష్ణుప్రియ వచ్చి.. నాకు అతని నుంచి ఎనర్జీ వస్తుంది. హ్యాపీనెస్ వస్తుంది కాబట్టి నేను ఎప్పుడైనా డౌన్ అయితే.. లో ఫీల్ అయితే అక్కడికి వెళ్తాను. కానీ నేను ఎప్పుడైనా అందరితో ఉంటానని విష్ణుప్రియ అంటుంది. నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు మీరు ఏదైనా చేస్తే.. అందరి ముందు నేను చెప్తే అను.. మీరు అందరి ముందు క్లోజ్ గా ఉంటారు. క్లోజ్ మీన్స్ నువ్వు ప్రొద్దున ఆల్రెడీ స్పెషల్ పర్సన్ అని చెప్పావని రోహిణి అంటుంది. నువ్వు అవినాష్ ప్రొద్దున కూడా ఎదో అంటున్నారు.. నేను వర్డ్స్ గుర్తుపెట్టుకొను ఓన్లీ ఎమోషన్ గుర్తు పెట్టుకుంటా అని విష్ణుప్రియ అంటుంది. ఏదైనా ఫన్నీగా చేస్తాం అంతేగానీ మీ రిలేషన్ ని స్పెషల్ గా నేనేం రిజిస్టర్ చెయ్యట్లేదని రోహిణి అంటుంది. అర్ధం అయిందా... ఇక నుండి మీ మ్యాటర్ తియ్యను.. నేనే అందరి ముందు మీ గురించి రిజిస్టర్ చేసేలా అన్నానంటే సారీ అని విష్ణుప్రియకి రోహిణి చెప్పి వెళ్లిపోతుంది.

ఆ తర్వాత రోహిణి టాస్క్ నుండి బయటకు వస్తుంది. విష్ణుప్రియ, రోహిణి మాట్లాడుకుంటారు. నువ్వు చేసింది నాకు హర్టింగ్ గా ఉంది.. ఆల్రెడీ బాల్స్ నాకు ఎక్కువ అతుక్కున్నాయి. అందరు టార్గెట్ చేశారు. కానీ నువ్వు బాల్స్ ఉన్నాయా ఓహ్ ఓకే అంటూ నువ్వు అనుకోవడం.. నాకు హర్టింగ్ ఉందంటూ విష్ణుప్రియతో రోహిణి చెప్పేసి వెళ్లిపోతుంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.