English | Telugu

రోజాని బాడీ షేమింగ్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు అడ్డుకోలేదు


జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ పొలిటిషన్స్ మీద హాట్ కామెంట్స్ చేసాడు. ఒక ఇంటర్వ్యూలో యాంకర్ కి రాకేష్ మధ్య ఈ హాట్ డిస్కషన్ జరిగింది. "జబర్దస్త్ లో ఎవరికి ఏ ఆపద వచ్చినా తీర్చే వ్యక్తి ముందుండే వ్యక్తి రోజా గారు" అని చెప్పాడు రాకేష్. ఒకప్పుడు జబర్దస్త్ లో నాగబాబు, రోజా జడ్జెస్ గా ఉండేవాళ్ళు. తర్వాత ఈ షోలో జడ్జెస్ మారిపోయారు. పాలిటిక్స్ లో ఉన్న కారణంగా రోజా కొంతకాలం షోస్ కి దూరంగా ఉంది. అలాగే నాగబాబు కూడా. ఐతే ఇటీవల రాకేష్ రోజా మీద, పవన్ కళ్యాణ్ మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. "అలాంటి రోజా గారినే జబర్దస్త్ లో పెర్ఫార్మ్ చేస్తూ ఇక్కడి నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత రోజా గారిని అన్నప్పుడు మీకు కోపం రాలేదా" అంటూ యాంకర్ అడిగింది.

"ఆవిడ దగ్గర మనం ఉన్నావ్, తిన్నావు, ఆవిడ నీడలో ఉన్నాం..వద్దురా తప్పురా అలా మాట్లాడ్డం.." అన్నా. "డబ్బులు కోసం" అంటారా అనేసరికి "దేని కోసం చేస్తున్నారో పాపం హెల్త్ బాలేకనో ఏమో" అంటూ కామెంట్ చేసాడు రాకేష్. "ఆడపిల్లలకు అన్యాయం జరిగితే ఊరుకోను, ఒప్పుకోను అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా" అని యాంకర్ అడిగేసరికి "అన్నారా ఆయన" అంటూ రాకేష్ కౌంటర్ వేసాడు. "ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా నేను అక్కడ ఉంటాను అది ఇది అని అంటారు కదా మరి రోజా గారిని అలా బాడీ షేమింగ్ గా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు స్టాప్ చెయ్యట్లేదు" అంటూ యాంకర్ అడిగారు. దానికి రాకేష్ "మహిళలుగా ఆ విషయం మీరే అడగాలి" అన్నాడు రాకేష్. "నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ ని" అంటూ యాంకర్ అడిగేసరికి "నేను కాదు నేను కాదు" అంటూ కౌంటర్ ఇచ్చాడు రాకేష్. ఈ ప్రోమో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.