English | Telugu

దయచేసి లైవ్ యానిమల్స్ ని గిఫ్ట్ చేయడం.కొనడం చేయొద్దు..అడాప్ట్ చేసుకోండి..

బుల్లితెర యాంకర్ గా రష్మీ గౌతమ్ కి ఉన్న పాపులారిటీ గురించి చెప్పక్కర్లేదు. ఆమె యాంకర్ గా, యాక్టర్ గా చేసింది. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి షోస్ ని హోస్ట్ చేస్తోంది. వీటికన్నా కూడా ఆమెకు పెట్స్ మదర్ అని మరో పేరు కూడా ఉంది. ఆమెకు పెట్స్ అంటే ఇష్టం. వాటి కోసం ఏమైనా చేస్తుంది. ఆల్రెడీ గతంలో ఆమెకు ఒక పెట్ డాగ్ ఉండేది. దాని పేరు చుట్కి గౌతమ్. ఐతే అది చనిపోయింది. దాని ఆస్తికాల్ని కూడా గోదాట్లో కలిపింది. ఇక ఇప్పుడు మరో పెట్ డాగ్ ఆమె ఇంటికి వచ్చింది. అది కూడా చాలా క్యూట్ గా బ్రౌన్ కలర్ లో ఉంది.

ఆ పెట్ డాగ్ తో తన పిక్స్ ని ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది రష్మీ. "నాకు ఇంకో అనుబంధం కానీ ఇంకో స్టోరీ కానీ వద్దు అనుకుంటున్నాను. అదృష్టం కొందరికే అనుకూలంగా ఉంటుంది ఇంకా వాడు అదృష్టవంతుడు..దయచేసి లైవ్ యానిమల్స్ ని గిఫ్ట్ చేయడం కానీ కొనడం కానీ చేయకండి. ఆర్థికంగా అలాగే భావోద్వేగాల పరంగా పెట్స్ తో 15 ఏళ్ళ అనుబంధం ఉంటుంది. అలాంటి కమిట్మెంట్ ఉన్నప్పుడు పెట్స్ అడాప్ట్ చేసుకోండి కానీ కొనద్దు" అంటూ ఒక పోస్ట్ పెట్టింది. ఇక యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహా ఐతే "ఈ పప్పీ క్యూట్ గా ఉంది" అని కామెంట్ చేసాడు. ఇంకో నెటిజన్ ఐతే "పెంపుడు జంతువులకు తల్లిగా ఉన్నందుకు ధన్యవాడు. ఒక పెట్ చనిపోయాక మరో పెట్ ని ఇంటికి తెచ్చుకోవడం కొంచెం కష్టమే కానీ ఇలాంటి పెట్స్ కి మీ ఇల్లు మంచి ప్లేస్ అనుకుంటున్నాను. మీరు ఎల్లప్పుడూ నాకు స్ఫూర్తినిస్తారు, మీ గురించి తలుచుకుంటే గర్వంగా ఉంది..మీ అభిమానిగా ఉండటం గర్వంగా ఉంది." అంటూ ఒక పోస్ట్ పెట్టారు. ఇంకా కొంతమంది ఐతే "సూపర్ మేడం యు అండ్ యువర్ పెట్ ..మంచి మెసేజ్ ఇచ్చారు. మంచి కాప్షన్ " అంటూ కామెంట్స్ చేశారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.