English | Telugu

సుమకు అరుదైన గౌరవం

సుమ కనకాలకు ప్రత్యేక పరిచయమే అవసరం లేదు. వండర్ఫుల్ ఆక్టర్, యాంకర్, స్పాంటేనియస్ హోస్ట్ ఇలా ఎన్నో బిరుదులూ ఆమెకు ఆడియన్స్ ఇచ్చారు. ఆనాటి ఋతురాగాల నుంచి నేటి జయమ్మ పంచాయతీ వరకు ఆమె లేని షో కానీ స్టేజి కానీ లేదు. ఎంతో మందికి ఫేవరెట్ కూడా. ఐతే సుమ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అలుపు అనేది లేకుండా ఎంతోమందిని అలరిస్తున్నందుకు ఒక అరుదైన గౌరవం దక్కింది. న్యూజెర్సీ లోని ఎడిసన్ టౌన్ షిప్ మేయర్ ఐన సామ్ జోషి చేతుల మీదుగా "ప్రొక్లేమేషన్" పేరిట ఒక గౌరవాన్ని అందుకున్నారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. యుఎస్‌లోని అతి పిన్న వయస్కుడైన మేయర్ అలాగే భారత సంతతికి చెందిన మొదటి మేయర్ నుంచి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో తాను చేసిన సేవలకు గాను ఈ గౌరవాన్ని పొందడం చాలా ఆనందంగా ఉంది అంటూ సుమ కనకాల విషెస్ చెప్పారు.

తాను చేపట్టే అన్ని స్వచ్ఛంద కార్యక్రమాలలో.అండగా ఉంటూ ఈ గౌరవం దక్కడానికి ప్రధాన కారణమైన ఉజ్వల్ కస్తాలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఎవరైనా ఏదైనా సాధించిన సమయంలో వాళ్ళ సేవలకు గాను గౌరవార్థంగా ఇచ్చే ఒక ప్రత్యేక పత్రం అన్నమాట. ఈ గౌరవం దక్కినందుకు ఆమెకు సోషల్ మీడియాలో ప్రశంసల వరద కురుస్తోంది. జయమ్మ పంచాయతీలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. లాంగ్ ఎపిసోడ్ "క్యాష్" నిర్వహించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది కూడా. ఐతే త్వరలో "బిగ్ బాస్ ఇంట్లో మా పరివార్" స్పెషల్ షో ను హోస్ట్ చేయబోతోంది సుమ. ఈ షోలో పార్టిసిపేట్ చేసే ఎంతోమంది ఫేమస్ టీవీ స్టార్స్ తో ఈ బీబీ హౌస్ లో టాస్కులు ఇచ్చి ఆడించబోతోంది. ఇక భర్త రాజీవ్ కానుకలతో విడాకులు అంటూ వచ్చిన పుకార్లపై సుమ అలీతో సరదాగా షోలో క్లారిటీ ఇచ్చేసింది. జంటగా విడాకులు తీసుకోవడం చాలా ఈజీ కానీ తల్లితండ్రులుగా విడాకులు తీసుకోవడం కష్టం అంటూ మనసులో మాటను చెప్పింది . ఏదేమైనా సుమకు అరుదైన గౌరవం దక్కడంపై సోషల్ మీడియాలో విషెస్ వరద ప్రవహిస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.