English | Telugu

Bigg Boss 9:  కన్ఫెషన్ రూమ్ లో వీడియో చూసి షాకైన ఆ ఇద్దరు!

బిగ్ బాస్ సీజన్-9 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాక ఆట స్వభావమే మారిపోయింది. ప్రతీ ఎపిసోడ్ కొత్తగా సాగుతోంది. వీకెండ్ లో నాగ్ వైల్డ్ కార్డ్స్ మాటల దూకుడికి చెక్ పెట్టాడు. వారం రోజులుగా ఓల్డ్ కంటెస్టెంట్స్ ని తమ మాటలతో టార్చర్ చేసారు. ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళు మాట్లాడిన వీడియోని చూపించి అసలైన గేమ్ మొదలుపెట్టాడు బిగ్ బాస్. రమ్య రావడంతోనే తను ఫుడ్ పవర్ తో ఎంట్రీ ఇచ్చింది. తను వచ్చి గేమ్ మీద కంటే అక్కడున్న జంటలపై ఫోకస్ పెట్టింది.

రమ్య, కళ్యాణ్ ని కన్ఫెషన్ రూమ్ కి నాగార్జున పిలుస్తాడు. మాధురి, రమ్య మాట్లాడుకుంటూ తనూజని కళ్యాణ్ ఎక్కడ పడితే అక్కడే టచ్ చేస్తున్నాడు.. నన్ను అలా టచ్ చేస్తే ఒక్కటిస్తానని రమ్య అంటుంది. ఆ వీడియోని చూపించగా కళ్యాణ్ షాక్ అవుతాడు. అలా అనడం కరెక్టేనా అమ్మాయిల పిచ్చి అని తన క్యారెక్టర్ పై ముద్ర వెయ్యడం తప్పు అని నాగార్జున చెప్తాడు. నా ఇంటెన్షన్ కరెక్టే కానీ ఆ మాట నేను వాడి ఉండకూడదు సర్ అని కళ్యాణ్ కి సారీ చెప్తుంది రమ్య. నేను అయితే ఏ ఉద్దేశ్యంతో అలా చెయ్యలేదు ఏదైనా తప్పుగా అనుకుంటే సారీ అని కళ్యాణ్ అంటాడు.

రమ్యకి ఇచ్చిన ఫుడ్ పవర్.. ఆ ఫుడ్ ని సుమన్ శెట్టితో షేర్ చేసుకోవడం సరైన నిర్ణయం కాబట్టి హౌస్ లో అందరు సరైన నిర్ణయం అంటారు. దాంతో తన ఫుడ్ పవర్ తనకే ఉంటుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.