English | Telugu

నా మీద ఏమైనా ఫీలింగ్ ఉంటే చెప్పు..... ఇక్కడితో ఆపేద్దాం!

బిగ్ బాస్ ప్రేమ కథ ముగింపుకి వచ్చింది. ఇన్ని రోజులుగా లవ్ బర్డ్స్ గా అనుకున్న విష్ణు-పృథ్వీల మధ్య ఇక ఏం లేనట్లేనా అంటే.. లేదనే చెప్పాలి. నిన్న హౌస్ లో నామినేషన్ లో ప్రక్రియలో భాగంగా విష్ణు, పృథ్వీలని నామినేట్ చేసిన వాళ్లంతా కామన్ గా చెప్పిన పాయింట్ ఒక్కటే.. అదే గేమ్ ఆడట్లేదు.. ఇద్దరే ఉంటున్నారు. పృథ్వీతో ఉంటున్నావ్.. నీ ఇండివిడ్యువల్ గేమ్ ఆడట్లేదు.. ఫోకస్ చెయ్యట్లేదని విష్ణుప్రియని నామినేట్ చేసారు. అలాగే పృథ్వీని కూడ అలాగే అంటూ నామినేషన్ చేశారు. అంటే టెలికాస్ట్ చేసే గంటలోనే అంత ట్రాక్ గా చూపిస్తే హౌస్ లో ఉన్న వాళ్లందరు.. అక్కడ ఇరవై నాలుగు గంటలు వాళ్ళని అబ్ సర్వ్ చేస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్లకు అలా అనిపించింది.

అయితే కన్నడ బ్యాచ్ అందరు ఒక గూటి పక్షులు ఒక గూటికి చేరినట్లు పృథ్వీ, ప్రేరణ, నిఖిల్, యష్మీలు నామినేషన్ తర్వాత కూర్చొని మాట్లాడుకుంటారు. నీకు విష్ణుపై ఏదైనా ఫీలింగ్ ఉందా అని పృథ్వీని యష్మీ అడుగుతుంది. అదేం లేదని పృథ్వీ అనగానే.. మరెందుకు ఇంత మందిలో తనతోనే క్లోజ్ ఉంటున్నావ్ .. అందరు అనుకునేలా చేస్తున్నావని పృథ్వీని అడుగుతుంది యష్మీ. దాంతో విష్ణుప్రియతో పృథ్వీ వచ్చి మాట్లాడతాడు. నాపై ఏదైనా ఫీలింగ్ ఉందా అని అడుగుతాడు. నీకు తెలియాలి.. నీకు అనిపిస్తుందా అని విష్ణుప్రియ అంటుంది. నాకు అవన్నీ ఇష్టం ఉండదు.. సింగల్ గా ఉండడం ఇష్టం.. అన్న మీనింగ్ వచ్చేలా పృథ్వీ మాట్లాడతాడు. నీకు ఏమైనా అలాంటివి ఉంటే ఇప్పుడే ఆపేద్దామని పృథ్వీ అనగానే విష్ణుప్రియ డిస్సపాయింట్ అవుతుంది. ఇక అక్కడి నుండి ఇద్దరు లేచి వెళ్లిపోతారు.

ఆ తర్వాత విష్ణుప్రియ డల్ గా బెడ్ దగ్గరికి వస్తుంది. తనని చూసిన నబీల్ .. ఏమైందని అడుగుతాడు. పృథ్వీ గురించా అంటూ ఆరా తీస్తాడు. నా గురించే అంటూ విష్ణు ఎమోషనల్ అవుతుంది. లైట్ మంచి హస్బెండ్ దొరుకుతాడని విష్ణుతో నబీల్ అంటాడు. ఇక ఇద్దరు మునపటిలా ఉండరేమోనని అందరు అనుకుంటున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.