English | Telugu

ముద్దులే ముద్దులు...ప్రేరణను ఫ్యామిలీ గెలిచేసింది

ఇష్మార్ట్ జోడి 3 ఈ వారం ఎపిసోడ్ లో ప్రేరణ అండ్ శ్రీపాద్ ఎంట్రీ ఇచ్చారు. అనిల్ జీల - అవని ఫామిలీని వేరే గ్రూప్ లోకి పంపించేసి..బిగ్ బాస్ లో ప్రేరణకు ఓంకార్ మాట ఇవ్వడంతో దాన్ని ఇప్పుడు ఫుల్ ఫిల్ చేసుకోవడానికి వాళ్లకు పిలిచాడు హోస్ట్ ఓంకార్. ఇక ఇద్దరూ పెళ్లి బట్టల్లో వచ్చారు అలా ఇద్దరి మధ్య ముద్దుల పోటీ పెట్టాడు. ఆ పోటీలో శ్రీపాద్ గెలిచాడు. ఇక తర్వాత వాళ్ళ రెండు కుటుంబాల వాళ్ళను స్టేజి మీదకు పిలిపించి వాళ్ళ పెళ్లి వీడియోని కూడా చూపించాడు. ఆ తరువాత ఆ ఐదు జంటలకు గేమ్ పెట్టాడు.

ఇక పేరెంట్స్ కూడా జోష్ తో ఉండాలని ఓంకార్ చెప్పాడు. దాంతో పీలింగ్స్ సాంగ్ కి అలీరెజా వాళ్ళ నాన్న, రాకేష్ వాళ్ళ అమ్మ కలిసి డాన్స్ ఇరగదీసారు. ఇక ఫైనల్ గా ఫామిలీస్ అందరికీ స్కూల్ లో ఆడించే అప్ అండ్ డౌన్ గేమ్ ఆడించాడు. ఇందులో ప్రేరణ ఫ్యామిలీ విన్ అయ్యింది. దాంతో ఒక ఉంగరాన్ని ప్రేరణకు ఇచ్చాడు. దాన్ని శ్రీపాద్ వెలికి తొడిగింది ప్రేరణ. అలాగే తమ ఫ్యామిలీని గెలిపించినందు శ్రీపాద్ వాళ్ళ చెల్లెకి, ప్రేరణ వాళ్ళ చెల్లికి ముద్దులిచ్చారు. ఇలా ఈ వారం ఫ్యామిలీ థీమ్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చి మరీ గెలిచేసింది ప్రేరణ.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.