English | Telugu

రాంప్రసాద్ స్కిట్‌లో ప‌స క‌నిపించ‌ట్లేదు!

ఎక్స్ట్రా జబర్దస్త్ కి ఇటీవల కాస్త రేటింగ్ తగ్గింది. ఒకప్పుడు ఆటో రాంప్రసాద్ స్కిట్ అంటే ఒక పేరుండేది. ఐతే ప్రస్తుతం రాంప్రసాద్ స్కిట్ కి ఆదరణ చాలా తగ్గింది. ఎందుకంటే రాంప్రసాద్ పదాలతో ప్రాపర్టీస్ చూపిస్తూ స్కిట్ నడిపిస్తున్నాడు తప్ప అందులో ఒక గ్రేస్ అనేది కనిపించట్లేదు. ఆటో రాంప్రసాద్ ఇటీవల హైపర్ ఆదిని ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే హైపర్ ఆది స్కిట్ లో కూడా పంచ్ డైలాగ్స్ తప్ప అందులో స్కిట్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు రాంప్రసాద్ కూడా అదే తరహాలోకి వెళ్ళిపోతున్నాడా అనిపిస్తోంది. రాబోయే ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో ఇటీవల రిలీజ్ అయ్యింది. ఇందులో చూస్తే ఆటో రాంప్రసాద్ స్కిట్ లో స్టేజి మీద ఎక్కువగా ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి. ఒక్కో డైలాగ్ కి ఒక్కో ప్రాపర్టీని చూపిస్తూ స్కిట్ నడిపించేసాడు.

దీనికి కారణం రాంప్రసాద్ ఫ్రెండ్స్ ఒక్కొక్కరిగా అతన్ని విడిచి వెళ్లిపోవడమే అని తెలుస్తోంది. బేసిగ్గా రాంప్రసాద్ ఒక రైటర్. కానీ తనతో ప్రయాణం చేసిన మిత్రులెవరూ ఇప్పుడు తోడుగా లేకపోవడంతో అసలు స్కిట్ ఏం రాయాలో కూడా తనకు అర్థం కావట్లేదు అని అన్నాడు."నా ఫ్రెండ్స్ నాతో ఉన్నప్పుడు మాత్రం అలా పక్కకెళ్లి కొన్ని నిమిషాల్లోనే అదిరిపోయే స్కిట్ రాసేసేవాడిని. కానీ ఇప్పుడు అలా ఏమీ రాయలేకపోతున్నా" అంటూ గతంలో ఒక స్కిట్ లో రాంప్రసాద్ తన మనసులో మాటను చెప్పాడు. ఎవరు ఉన్న లేకున్నా షో ముందుకెళ్లాలంటే మంచి స్కిట్స్ ఉండాలి కాబట్టి రాంప్రసాద్ ఇకనుంచి మంచి టైమింగ్ ఉన్న స్కిట్స్ రాసుకుని పెర్ఫార్మ్ చేయాలనీ ఆడియన్స్ ఆశిస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.