English | Telugu

Bigg Boss Nikhil : కావ్యశ్రీ గురించి చెప్తూ నిఖిల్ ఎమోషనల్.. బయటకు రాగానే...

బిగ్ బాస్ సీజన్-8 (Bigg Boss 8 Telugu) 11వ వారం ముగింపుకి వచ్చేసింది. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది క్యూరియాసిటిగా మారింది. ఈ తరుణంలో శనివారం నాడు గ్రాంఢ్ లుక్ లో ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున.

ఇక రాగానే శుక్రవారం నాడు హౌస్ లో ఏం జరిగిందో చూపించాడు నాగార్జున. హౌస్ లో ఇప్పుడు పది మంది కంటెస్టెంట్లు ఉండగా వారు తమ లవ్ స్టోరీలను చెప్పేశారు. ఈ క్రమంలో యష్మీ గౌడ, జబర్దస్త్ రోహిణి, టేస్టీ తేజ, పృథ్వీ, నబీల్, నిఖిల్ తమ తమ ప్రేమకథల్ని చెప్పుకొచ్చారు. ఇందులో నిఖిల్ తన ప్రేమ కథను చెప్పి ఏడ్పించేశాడు. ఆమెను ఇంకా వదిలేయలేదని, ఆమెతో తనకి చాలా మెమరీస్ ఉన్నాయని, ఆమె ఎప్పటికీ నా భార్యే అని చెప్తూనే ఏడ్చేశాడు నిఖిల్. షో నుంచి బయటకు వెళ్లిన వెంటనే ఆమె దగ్గరకు వెళ్తాను.. మొదటగా బతిమిలాడుతాను.. కొడితే పడతాను.. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా కొట్టించుకున్నాను.. ఓ బిడ్డ తప్పు చేస్తే అమ్మ ఎలా క్షమిస్తుందో అలా నన్ను కూడా క్షమించు.. నేను చేసిన వాటికి సారీ చెబుతున్నానంటూ నిఖిల్ ఏడ్చేశాడు. అంటే కావ్యను నిఖిల్ ఒప్పించే ప్రయత్నం ఇంకా చేస్తాడనిపిస్తోంది. ఇది ఇప్పుడు మోస్ట్ వైరల్ గా మారింది.

తేజ అయితే తను అంత అందంగా లేడని చెప్పి బ్రేకప్ చెప్పేశారట. ఫ్యామిలీ మెంబర్లకు ఇష్టం లేదని చెప్పి వెళ్లిపోయిందట. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆమె ఫోన్ చేసి మిస్ యూ అని చెప్పిందట. తాను ఎవరిని పెళ్లి చేసుకున్నా కూడా అమ్మలా చూసుకుంటాను అని చెప్పాడు. రోహిణి తన ప్రియుడి చేతిలో మోసపోయిందట. ఇలా పృథ్వీ, యష్మీ, నబీల్ ఇంకా మిగతా కంటెస్టెంట్స్ తమ లవ్ స్టోరీలని, బ్రేకప్ స్టోరీలని చెప్పుకున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.