English | Telugu

Biggboss 8 Telugu: బిగ్ బాస్ హౌస్ లో  ప్రేమకథ పట్టాలెక్కినట్లేనా!

బిగ్ బాస్ లో ఎక్కువ రోజులు ఉండాలంటే ఈ సూత్రం కంపల్సరీ. అదేంటంటే.. అబ్బాయి,అమ్మాయితో లవ్ ట్రాక్ నడపడం. అది అనుకోకుండా హౌస్ లో కుదరుతుందో లేక బిగ్ బాస్ కావాలని అలా లవ్ ట్రాక్ నడిపిస్తే మనం కంటెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతామని అనుకుంటారో ఏమో తెలియదు గానీ సీజన్ కి రెండు జంటలు మాత్రం అవుతున్నాయి. బిగ్ బాస్ కూడా లవ్ గురునే కాబట్టి వీటికి స్క్రీన్ స్పేస్ ఎక్కువే ఇస్తుంటాడు.

ఇలాంటి జంటలని చివరివరకు ఉంచి ఇక వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత పెళ్లే అన్నట్లు వాళ్లపై ప్రోమోలు వదులుతుంటాడు బిగ్ బాస్ మామ. ఈ సీజన్లో నిఖిల్ ఏంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే నిఖిల్ హౌస్ లోకి సింగిల్ అంటూ ఎంట్రీ ఇచ్చి.. మింగిల్ అయి వెళ్తాడనిపిస్తుంది. నిఖిల్ కి బిగ్ బాస్ ఎంట్రీకి ముందువరకు బయట లవ్ స్టోరీ ఉంది. అన్ని షోస్ లో కూడా నిఖిల్ తన లవర్ పార్టిసిపేట్ చేసేవారు. కానీ నాగార్జున తో స్టేజ్ మీద నేను సింగల్ అనగానే అందరు షాక్ అయ్యారు. మరి ఆ సింగిల్ అని ఎందుకు అన్నాడో ఆల్రెడీ కమిటెడ్ అని తెలిస్తే హౌస్ లో లవ్ ట్రాక్ నడిపేందుకు వీలు అవ్వదని ఆలా చెప్పాడో లేక నిజంగానే బ్రేకప్ అయిందో తెలియదు కానీ మనోడు హౌస్ లో మాత్రం వేరేలా ఉంటున్నాడు. ప్రస్తుతం సోనియాతో నిఖిల్ చనువుగా ఉంటున్నాడు. ఎక్కడ చుసినా వీళ్ళిద్దరే ఉంటున్నారు. అదే డౌట్ వచ్చి విష్ణుప్రియ అడగ్గా.. అది కాస్తా ముదిరి పెద్దగొడవనే అయింది కానీ హౌస్ మేట్స్ అందరిలోను వాళ్ళ బిహేవియర్ పై కాస్త డౌట్ గానే ఉంది.

అయితే హౌస్ లో ఏ టాస్క్ పెట్టిన అందులో సోనియా గెలిచినా , గెలవకపోయిన, నిఖిల్ గెలిచినా గెలవకపోయిన ప్రతిసారి నిఖిల్ ని సోనియా హగ్ చేసుకోవడం కామన్ అవుతుంది. అంటే వీళ్ళు ఓదార్చుకోవడం కోసమే టాస్క్ లు ఆడుతున్నారా అనిపిస్తుంది. ఎప్పుడు ఇద్దరు పక్కపక్కనే కూర్చోవడం ఎమోషన్స్ ని షేర్ చేసుకోవడం చూస్తుంటే ప్రేమ కథ పట్టాలెక్కినట్లే అనిపిస్తుంది. మరి వీరిమధ్య నిజంగానే ఇష్క్ సిఫాయా ఉందా లేక కంటెంట్ కోసం ఇద్దరు అలా చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. వీరిద్దరిని చూసి మరి మీకేనపిస్తుందో కామెంట్ చేయండి.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.