English | Telugu
బిగ్ బాస్ హిస్టరీలోనే మోస్ట్ ఇరిటేటింగ్ కంటెస్టెంట్ గా యష్మీ!
Updated : Sep 14, 2024
బిగ్ బాస్ మొదలై రెండు వారాలవుతుంది. కానీ ఇప్పటికి హౌస్ లోని వాళ్ళలో పలానా వీళ్ళు ఫేవరెట్ అన్న ఫీలింగ్ కి ఇంకా జనాలు రావట్లేదు. 14 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ షో మొదటి వారం బేబక్కకి బై చెప్పేయడంతో ఇప్పుడు పదమూడు మంది ఉన్నారు.
ప్రతి సీజన్ లాగే ఇప్పుడు కూడా మళ్ళీ ఒక గ్రూప్ అయితే మొదలైంది. వాళ్లే యష్మీ, ప్రేరణ, నిఖిల్, పృథ్వి, అభయ్. వీళ్ళంతా షోకీ ముందు నుండే పరిచయం కాబట్టి హౌస్ లో కూడా అలాగే ఉంటున్నారు. యష్మీ చీఫ్ అయి చాల చీప్ గా బెహేవ్ చేస్తుంది. ఎక్కువ స్క్రీన్ స్పేస్ కి ట్రై చేస్తుంది. టాస్క్ లో విన్ అవ్వడం బిగ్ బాస్ పవర్ ఇవ్వడంతో అప్పోజిట్ టీమ్ కి చుక్కలు చూపించింది. వాళ్లు బాధపడుతుంటే యష్మీ, ప్రేరణలు పార్టీ చేసుకుంటున్నారు. తనకి నచ్చిన వాళ్ళు గెలిస్తే చాలు మిగతా వాళ్ళ ఫీలింగ్ తో సంబంధం లేకుండా బెహేవ్ చేస్తుంది. మొన్న జరిగిన సాక్స్ ప్రొటెక్షన్ టాస్క్ లో నబిల్, విష్ణుప్రియ అవుట్ అవ్వడంతో యష్మీ పిచ్చి పిచ్చిగా ఎగురుతూ, గెంతుతూ పృథ్వీతో కలిసి తీన్ మార్ డ్యాన్స్ కనిపించింది. ఇక్కడ యష్మీ, పృథ్వీలని చూసిన వారందరికి "ఏం సైకో గాళ్ళు ఉన్నార్రా" అనేంతలా అనిపించింది.
ఇక యష్మీ ని చూసిన ట్రోలర్స్.. ఆ జేజమ్మే మళ్ళీ బిగ్ బాస్ కి వచ్చింది రా అని యష్మీ స్థానంలో శోభాశెట్టి ముఖాన్ని పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు. సీజన్ సెవెన్ లో శోభాశెట్టికి ఎంత నెగెటివ్ వచ్చిందో రెండు వారాలకే యష్మీకి అంతటి నెగెటివ్ వచ్చింది. ఇక ఈ వారం నామినేషన్ లో లేదు కాబట్టి సేఫ్ అయింది. ఒక్కసారి నామినేషన్ కి వస్తే ఎలిమినేషన్ చేసేదాకా వదలిపెట్టమని నెటిజన్లు భావిస్తున్నారు.