English | Telugu

ఓయో రూమ్ లా మారిపోయిన బిగ్ బాస్ హౌస్...పృథ్వీకోసం విష్ణుప్రియ!

 


బిగ్‌బాస్ సీజన్-8 కి విష్ణుప్రియ ఎందుకొచ్చిందో ఆమెకే తెలీదు.. ఓట్లు ఎందుకేస్తున్నారో విష్ణు ఫ్యాన్స్‌కి తెలీదు.. అసలు ఆమెను ఎందుకు హౌస్‌లో కొనసాగిస్తున్నారో జనాలకీ తెలీదు. నిజమే.. కానీ ఈ తెలీదు తెలీదు అన్న ప్రశ్నలకి ఓ క్లారిటీ అయితే ఇచ్చింది. తను కప్పుకొట్టడానికి రాలేదని పృథ్వీనే కావలని, అతనే హైఎస్ట్(ఎక్కువ) ప్రియారిటీ అని డైరెక్ట్‌గా చెప్పింది విష్ణుప్రియ. ఇది చూసిన నెటిజన్లు తెగ ఫైర్ అవుతున్నారు.

ఇక నిన్నటి ఎపిసోడ్ లో విష్ణుప్రియ చెప్పిన మాటలకి నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు‌. నువ్వు హౌస్ లోకి ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడానికి వెళ్ళావా లేక పృథ్వీతో ఉండటానికి వెళ్ళావా అంటు ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ఇది బిగ్ బాస్ హౌసా లేక ఓయో రూమా విష్ణుప్రియ.. గేమ్ ఆడవు.. ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వవు.. అలా ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చే అవినాష్, రోహిణిలని టార్గెట్ చేస్తావ్.‌ అసలు నువ్వేం చేస్తున్నావని ఇంకా హౌస్ లో ఉంటున్నావంటు మరో నెటిజన్ కామెంట్ చేశాడు. అసలు బిగ్ బాస్  హౌస్ లో ఓ వైపు కన్నడ బ్యాచ్ కన్నింగ్ స్ట్రాటజీ నడుస్తుంటే మరోవైపు విష్ణుప్రియ పృథ్వీతో చేసే ఛంఢాలం.‌‌. ఫ్యామిలీతో కలిసి చూడలేకుంటే చేస్తున్న విష్ణుప్రియని ఎలిమినేషన్ చేయాలంటూ నెట్టింట ఆమెపై తీవ్రంగా ట్రోల్స్ వస్తున్నాయి. అయితే మన బిగ్ బాస్ మామ గురించి తెలిసిందే కదా‌‌.. విష్ణుప్రియకి సంబంధించిన ఒక్క నెగెటివ్ ఫుటేజ్ కూడా రాకుండా ఎంత జాగ్రత్త పడుతున్నాడో.‌‌. ఆమె వల్ల హౌస్ లో జెన్యున్ గా ఉండే అవినాష్, రోహిణి, నబీల్ , గౌతమ్ కృష్ణ లాంటి కంటెస్టెంట్స్ కి అన్యాయం జరుగుతుంది.

అయితే ఈ వారం నామినేషన్లో కన్నడ బ్యాచ్ తో పాటు తెలుగు కంటెస్టెంట్స్ అవినాష్, గౌతమ్ నామినేషన్ లో ఉన్నారు. మరి బిగ్ బాస్ మామ వారిని కాకుండా వీళ్ళనే ఎలిమినేషన్ చేసి మరోసారి విష్ణుప్రియ బిగ్ బాస్ దత్తపుత్రిక అని నిరూపించుకుంటాడా లేక కన్నడ బ్యాచ్ కే ఫేవరెట్ గా నిలుస్తాడా చూడాలి మరి.