English | Telugu
Illu illalu pillalu : నర్మద, ప్రేమ మాస్టర్ ప్లాన్.. అడ్డంగా దొరికిపోయిన శ్రీవల్లి!
Updated : Dec 1, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -330 లో...... నర్మద, ప్రేమ కలిసి శ్రీవల్లి దగ్గరున్న నగలు బయటపెట్టడానికి ప్లాన్ చేసి ఒక స్వామిని యాక్టింగ్ చెయ్యడానికి తీసుకొని వస్తారు. అతను ఎక్కడ నగలున్నా కనిపెడతానని చెప్పి ఇంట్లో అందరి దగ్గరున్న నగలు తీసుకొని రండి అని చెప్పగానే అందరు నగలు తీసుకొని వస్తారు. ఇంకా ఏమైనా మర్చిపోతే అవి అన్నీ ఆకులు అయ్యేలా చేసానని స్వామి చెప్తాడు. దాంతో శ్రీవల్లికి టెన్షన్ మొదలవుతుంది. స్వామి వెళ్లిపోయాక శ్రీవల్లి తన అమ్మకి ఫోన్ చేసి అసలు విషయం చెప్తుంది.
నేను వస్తున్నానని భాగ్యం చెప్తుంది. భాగ్యం ఆనందరావు గేట్ దగ్గరికి వస్తారు. ప్రేమ, నర్మద వాళ్ళని ఆపేస్తారు. నగలు బయటపడేవరకు బయట నుండి ఒక్క పురుగు కూడా రావొద్దని చెప్పి వాళ్ళని భయపెట్టి తిరిగి వెనక్కి పంపిస్తారు. వేదవతి దగ్గరికి శ్రీవల్లి వచ్చి.. అత్తయ్య ఆ స్వామి అన్ని వట్టిగనే చెప్పాడు. మీరేం టెన్షన్ పడకండి అని చెప్తుంది. ఆ మాటలు విన్న ప్రేమ, నర్మద ఇద్దరు తనకి భయం పుట్టించాలనుకుంటారు. అత్తయ్య నేను ఒక రింగ్ దాచాను.. ఇదిగోండి ఆకుగా మారిందని నర్మద అనగానే వేదవతి ఇంకా భయపడుతుంది. అసలు ఆ నగలు కూడా ఆకులుగా మారాయి కావచ్చని అంటుంది.
వెంటనే శ్రీవల్లి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి విషయం చెప్తుంది. నువ్వు కూడా ఆ నగలు తీసి ఆకులుగా మారాయో చూడమని చెప్తుంది. దాంతో శ్రీవల్లి గొయ్యి తీసి నగల మూట తీసి చూస్తుంది. అందులో నగలు ఉంటాయి. అవి చూసి శ్రీవల్లి మురిసిపోతుంది. అప్పుడే ప్రేమ, నర్మద వస్తారు. వాళ్ళని చూసి శ్రీవల్లి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.