English | Telugu

బాడీ షేమింగ్ పై పృథ్వీకి నాగార్జున వార్నింగ్.. గౌతమ్ కి షాక్!

బిగ్ బాస్ సీజన్-8 లో ఇప్పటికే ఏడు వారాలు గడిచింది. ఇక అయితే ఎనిమిదో వారం వీకెండ్ కి వచ్చేసింది. శనివారం నాటి ప్రోమో కోసం జనాలు ఎంతగా ఎదురు చూస్తారో తెలిసిందే. గత వారం ప్రోమో లేటుగా అప్లోడ్ చేశారంటు బిబి టీమ్ ని నెటిజన్లు ట్రోల్ చేయగా.. ఇప్పుడు పొద్దున్నే వదిలారు.

బిగ్ బాస్ ప్రోమోలో నాగార్జున వచ్చీ రాగానే ఓ కర్రతో వచ్చాడు. నామినేషన్ లో కుండలు పగులగొట్టినట్టు అందరి పర్ఫామెన్స్ చూసి ఈ వారం ఎవరు చెత్తగా ఆడారో వారి ఫోటో ఉన్న కుండని పగులగొడతాడన్న మాట. ఇక పృథ్వీని లేపి.. కింద నుండి పై దాకా చూశాడు నాగార్జున. నేనేం నిన్ను బాడీ షేమింగ్ చేయడం లేదు.. అలా చూశాను అంతే అని నాగార్జున అనగానే ఆ ఇంటెన్షన్ తో చూడలేదు సర్ అని పృథ్వీ అన్నాడు. నా ఇంటెన్షన్ కూడా అది కాదని నాగార్జున అన్నాడు. ఆ పాయింట్ వినగానే రోహిణిని పృథ్వీ నామినేషన్ లో చూసింది అంతా గుర్తొచ్చింది. ఈ పాయింట్ మీద పృథ్వీకి గట్టిగానే వార్నింగ్ పడ్టట్టు ఉంది. ఇక నిఖిల్ సంఛాలక్ గా ఎలా ఉన్నాడో చెప్పుకొచ్చాడు నాగార్జున.

క్వశ్చన్ అంతా పూర్తయ్యాకే బజర్ నొక్కమని బిగ్ బాస్ చెప్పాడని టేస్టీ తేజ అనగానే.. మీ రాయల్స్ అంతా క్వశ్చన్ పూర్తయ్యాకే బజర్ నొక్కారా అని నాగార్జున అడిగాడు. క్వశ్చన్ రిపీట్ చేయదన్నారు చేయలేదు సర్ అని నిఖిల్ అనగానే.. తేజ ఈ కుట్ర నువ్వు పన్నావ్ అన్నమాట అని నాగార్జున అనగానే.. తేజ బిత్తరపోయాడు. యష్మీ విష్ణుప్రియని ఎందుకు నామినేట్ చేశావని నాగ్ అడుగగా.. సెవెన్ వీక్స్ లో ఇండివిడ్యువల్ గేమ్ నాకు ఎక్కడ కనపడలేదని యష్మీ అంది.. మరి నీ ఇండివిడ్యువల్ గేమ్ ఏదని నాగార్జున క్వశ్చన్ చేసేసరికి.. తను షాక్ అయ్యింది.

నువ్వు మెగా ఛీఫ్ అయ్యాక లేడీస్ వీక్ అని డిక్లేర్ చేస్తున్నావ్.. కొన్ని వినడానికే బాగుంటాయి. ఆచరించడానికి బాగోవు.. కోపంలో ఓ మాట.. కోపం తగ్గాక ఓ మాట.. ఇష్టం ఉంటే ఓ మాట.. ఇష్టం లేకపోతే ఓ మాట మాట్లాడతావా అంటు గౌతమ్ ని నాగ్ అడిగాడు. ఏదో షార్ట్ టెంపర్ లో అలా అన్నాను అని గౌతమ్ అన్నాడు. ఇక ఈ ప్రోమోని బట్టి చూస్తే కొందరికి గట్టిగానే వార్నింగ్ వచ్చినట్టు ఉంది. యూట్యూబ్ లో ఉన్న ఈ ప్రోమో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.