English | Telugu

తారక్, మహేష్ ఫ్యాన్స్ కి అసలుసిసలు పండగ!

'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోలో అప్పుడప్పుడు సెలబ్రిటీలు వచ్చి సందడి చేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి-కొరటాల శివ, సమంత, దేవిశ్రీప్రసాద్-తమన్ ఈ షోకి గెస్ట్ లుగా వచ్చి ఎంటర్టైన్ చేశారు. ఇక ఈ షోకి మహేష్ బాబు గెస్ట్ గా రాబోతున్నట్లు షో నిర్వాహకులు తాజాగా అధికారికంగా ప్రకటించారు.

'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకి గెస్ట్ గా మహేష్ రాబోతున్నట్లు ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. ఈ ఎపిసోడ్ షూట్ కూడా ఎప్పుడో పూర్తయింది. షూట్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. మొదట ఈ ఎపిసోడ్ దసరా కానుకగా టెలికాస్ట్ కానుందని న్యూస్ వినిపించింది. కానీ ఆ ప్లేస్ లో సమంత ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. ఇక దీపావళికి టెలికాస్ట్ కానుందని ప్రచారం జరగగా.. ఆ ప్లేస్ లో దేవిశ్రీప్రసాద్-తమన్ ల ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. దీంతో మహేష్ ఎపిసోడ్ ఎప్పుడొస్తుందా అని డ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫ్యాన్స్ ని ఖుషీ చేసే న్యూస్ తాజాగా వచ్చింది. 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోలో మహేష్ పాల్గొన్న ఎపిసోడ్ త్వరలోనే టెలికాస్ట్ కానుందని తెలియజేస్తూ తాజాగా షో నిర్వాహకులు పోస్టర్ ను విడుదల చేశారు.

తారక్, మహేష్ లకు మంచి బాండింగ్ ఉంది. మహేష్ ని తారక్ అన్నయ్య అని పిలుస్తాడు. గతంలో వీళ్ళిద్దరూ 'భరత్ అనే నేను' ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఒకే స్టేజ్ పై కనిపించి కనువిందు చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి బుల్లితెరపై సందడి చేస్తే షోకి రికార్డ్ రేటింగ్స్ రావడం ఖాయమనే చెప్పాలి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.