English | Telugu

ప్రియాను బయటకు పంపేసిన 'బిగ్ బాస్'

స్పెషల్ ట్రీట్మెంట్లు గట్రా ఏమీ లేవు. తప్పు తప్పే! ఓటింగ్ ఓటింగే!! ఆర్టిస్ట్ ప్రియాను 'బిగ్ బాస్' బయటకు పంపేశాడు. నిజం చెప్పాలంటే... బిగ్ బాస్ పంపలేదు. ప్రేక్షకులు తనను బయటకు పంపేలా ప్రియా ప్రవర్తించింది. ఇప్పటివరకూ 'బిగ్ బాస్' ఎలిమినేషన్స్ గమనిస్తే... ఎవరికైనా ఈ విషయం ఈజీగా అర్థం అవుతుంది. హైస్‌లో హద్దుమీరి మాట్లాడినా... ఇతరుల పట్ల అనుచితంగా ప్రవర్తించినా... ప్రేక్షకులు ఏమాత్రం క్షమించడం లేదు. వాళ్లు గనుక డేంజర్ జోన్ లోకి వస్తే... ఓటింగ్ వేయడంతో లేదు. దాంతో ఎలిమినేట్ అవుతున్నారు.

ప్రియా విషయానికి వస్తే... లాస్ట్ వీక్ ఆమె ప్రవర్తన ఏమంత బాగోలేదు. సన్నీని గడ్డిపోచతో పోల్చింది. అటువంటి చర్యలు టీఆర్పీలకు పనికొస్తాయి గానీ, ఆర్టిస్టులకు మంచి ఇమేజ్ తీసుకురావు. అదే ఎలిమినేషన్ కి కారణం అయ్యిందని చెప్పవచ్చు.

ప్రియా హౌస్ నుండి బయటకు రావడం కొంతమంది అభిమానులకు నచ్చలేదు. ప్రియా కోసం షో చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. టెలికాస్ట్ చేసే ఫుటేజ్ లో ఆమె ఎక్కువసేపు కనిపిస్తుంది కూడా! ఇప్పుడు షోకి కొంత అట్రాక్షన్ తగ్గిందని చెప్పాలి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.