English | Telugu

'ఈఎంకే' షో చేయలేనని చెప్పిన తారక్.. షాక్ లో నిర్వాహకులు!

'బిగ్ బాస్' షోతో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతో మరోసారి ప్రేక్షకులను అలరిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ మొదటి సీజన్ కు హోస్ట్ గా చేసిన తారక్.. ఆ తర్వాత సీజన్లకు హోస్ట్ చేయలేదు. ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో విషయంలోనూ తారక్ అదే రిపీట్ చేయబోతున్నారని న్యూస్ వినిపిస్తోంది.

'బిగ్ బాస్' షో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వడానికి ప్రధాన కారణం తారక్ అనే చెప్పొచ్చు. తన టాకింగ్ పవర్, కామెడీ టైమింగ్ తో షోని గ్రాండ్ సక్సెస్ చేశారు. అయితే ఊహించని విధంగా తర్వాత సీజన్లకు తారక్ హోస్ట్ గా వ్యవహరించలేదు. దీంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఇక ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో విషయంలోనూ తారక్ అదే రిపీట్ చేయనున్నారని తెలుస్తోంది. 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతో హోస్ట్ గా రీఎంట్రీ ఇచ్చిన తారక్ మరోసారి తనదైన శైలిలో అలరిస్తున్నారు. అయితే హోస్ట్ గా తారక్ కి మరోసారి ఫుల్ మార్క్స్ పడినా.. షోకి ఆశించినస్థాయిలో రేటింగ్స్ రావడంలేదని అంటున్నారు. అసలే రేటింగ్ విషయంలో కాస్త నిరాశలో ఉన్న షో నిర్వాహకులకు తారక్ ఊహించని షాక్ ఇచ్చారని వార్తలొస్తున్నాయి.

ఇప్పటికే 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో ఈ సీజన్ కి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసిన తారక్.. ఇక మీదట ఈ షోని తాను చేయలేనని చెప్పారట. దీంతో నిర్వాహకులు తారక్ ని ఒప్పించే పనిలో ఉన్నారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.