English | Telugu

ఒక ఓల్డేజ్ హోమ్ పెట్టి పెద్దవాళ్ళను చూసుకునే శక్తి ఇవ్వు శివయ్యా

ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్తీక పౌర్ణమి స్పెషల్ గా వచ్చింది. ఐతే ఇందులో కొంతమంది వాళ్ళ వాళ్ళ కోరికలు ఆ శివయ్యకు విన్నవించుకున్నారు. వాటిని ప్లే చేసి అందరూ విన్నారు. ఇక మంజుల పరిటాల ఒక మంచి కోరికను కోరుకున్నారు. "శివయ్య తండ్రి ఒక కూతురిగా కొడుకుగా మా అమ్మానాన్నను చూసుకునే శక్తీ, ధైర్యం ఇచ్చావ్. అలాగే చాలామంది ఆడపిల్లలు వాళ్ళ తల్లితండ్రులను చూసుకోలేక బాధపడుతున్నారు. సో అలాంటి తల్లితండ్రులను ఓల్డేజ్ హోమ్ లో పెట్టి చూసుకునేంత అదృష్టం, శక్తీ నవ్వు ఇవ్వు తండ్రి" అని మంజుల పరిటాల కోరుకుంది.

"ఇలాంటి ఒక కోరికకు ఇక్కడ ఉన్న చాలామంది కూడా హెల్ప్ చేస్తారు. ఐతే ఇలాంటి ఒక కోరికను కోరుకోవడానికి కారణం ఏమిటి" అని రష్మీ అడిగింది. "నిజానికి మా అమ్మకు మేము నలుగురం ఆడపిల్లలం. ఐతే చూసిన వాళ్లంతా కూడా నలుగురు ఆడపిల్లలా అని ఆమె బాధపడేలా కామెంట్స్ చేసేవారట చిన్నప్పుడు. అప్పుడు అమ్మ చాలా బాధపడిందట. ఆడపిల్లలు కూడా ఎందులోనూ తక్కువ కారు. వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ ని మంచిగా చూసుకుంటున్నారు. కానీ కొంతమందికి మాత్రం వాళ్ళ పేరెంట్స్ ని చూసుకోవాలి అనుకున్నా చూసుకోవడానికి అవ్వట్లేదు. వాళ్ళు ఆ విషయంలో బాధపడడం నేను చూసాను కాబట్టి అలాంటి పరిస్థితి ఎవరికీ రాకున్నా వాళ్ళను నేను ఒక చోట ఉంచి చూసుకోవాలి అనుకునేదాన్ని. చూడాలి ఎంత వరకు అవుతుంది అని. దానికి నాకు శక్తి ఇవ్వమని ఆ శివయ్యను కోరుకున్నా" అంటూ మంజుల తన మనసులో కోరికను బయట పెట్టింది. "మీ కోరికను ఎలా బయట పెట్టారో మీ ప్లాన్ ని కూడా ఆఫ్ - కెమెరా డిస్కస్ చేయండి. కచ్చితంగా ఇక్కడ ఉన్నవాళ్ళంతా మనఃస్ఫూర్తిగా సహాయం చేస్తారు. ఇలాంటి ఒక మంచి పనిలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు అవుతారు" అంటూ రష్మీ చెప్పింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.