English | Telugu

Manikanta Elimination : మణికంఠ ఎలిమినేషన్ కన్ఫమ్.. రీజన్ ఇదే!

బిగ్‌బాస్ ఏడో వారం ఎలిమినేషన్ లీక్ అయ్యింది. హౌస్ లో శనివారం, ఆదివారం నాటి షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇక కొంతమంది నుండి స్ట్రాంగ్ లీక్స్ వచ్చాయి. మొదటగా పృథ్వీ ఎలిమినేషన్ అని కొంతమంది చెప్పగా.. ఇప్పుడేమో సోషల్ మీడియా మొత్తం మణికంఠ ఎలిమినేషన్ అనే వార్తలొస్తున్నాయి.

ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న పృథ్వీ, నిఖిల్, మణికంఠ, నబీల్, యష్మీ, ప్రేరణ, గౌతమ్, తేజ, హరితేజల్లో ఓటింగ్‌లో స్ట్రాంగ్‌గా ఉన్న కంటెస్టెంట్లు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా నిఖిల్, నబీల్, ప్రేరణలకి ఓటింగ్ చాలా స్ట్రాంగ్‌గా పడింది. ఇక మిగిలిన వాళ్లలో తేజ, హరితేజ, పృథ్వీల ఓటింగ్ విషయానికొస్తే చాలా టైట్‌గా జరిగినట్లు తెలిసింది. కానీ ఈ వారం ఆటలో గౌతమ్ భారీ పెర్ఫామెన్స్ ఇచ్చి ఏకంగా మెగా చీఫ్ అయిపోయాడు. దీంతో గౌతమ్ ఓటింగ్ చివరి రెండు రోజులు భారీగా పెరిగింది. అలానే యష్మీ, టేస్టీ తేజ, హరితేజలు కూడా టాస్కుల్లో గట్టిగానే ఆడారు. కనుక వీరికి కూడా ఓటింగ్ బాగానే పడింది.

అయితే ఈ వారం ఆట విషయానికొస్తే మణికంఠ ఏం ఆడలేదు. స్మార్ట్ ఛార్జింగ్ టాస్కులో.. నేను ఆడను.. బొక్కలు ఇరగ్గొట్టుకోలేను.. నేను ఎలిమినేట్ అయిపోయినా పర్లేదంటూ ఓ పక్కన కూర్చున్నాడు. ఇదే మణికంఠకి పెద్ద దెబ్బ. ఇన్ని వారాలు ఆట సరిగ్గా ఆడినా ఆడకపోయినా ఆడియన్స్ సింపథీ ఓట్లతో బతికిపోయాడు మణికంఠ. కానీ ఈ వారం కావాలని అందరితో గొడవ పెట్టుకోవడం.. ఆట ఆడకుండా కూర్చోవడం అన్నీ దెబ్బేశాయి. దీంతో ఎలిమినేట్ అయిపోయినట్లు తెలుస్తోంది. అయితే మణికంఠ ఎలిమినేషన్ కన్ఫమ్ అనే వార్తలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.