English | Telugu
బుగ్గలేసుకుని చాలా బాగున్నారంటూ రోహిణి పై మహేష్ కామెంట్స్
Updated : Sep 2, 2022
జీ తెలుగు ఎప్పటికప్పుడు సరికొత్తగా రియాలిటీ షోలు చేస్తూ దాని ద్వారా మూవీ ఇండస్ట్రీకి కొత్త కొత్త సింగర్స్ ని, డాన్స్ కొరియోగ్రాఫర్ లను అందిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది జీ తెలుగు. ఇక ఇప్పుడు ఒక సరికొత్త డాన్స్ రియాలిటీ షో డాన్స్ ఇండియా డాన్స్ తెలుగు షోతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ షో ప్రతీ ఆదివారం రాత్రి ప్రసారమౌతోంది. ఇప్పుడు ఈ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. మహేష్ బాబు ఆయన కూతురు సితార ఇద్దరూ ఈ షోకి గెస్ట్స్ గా వచ్చారు. మహేష్ బాబు అంటే అభిమానించని వారంటూ ఎవరూ ఉండరు. మహేష్ జనరల్ గా ఏ షోస్ కి కూడా హాజరుకారు. కానీ ఈ షోకి ఫస్ట్ టైం కూతురుతో కలిసి వచ్చారు. జబర్దస్త్ లో ఫేమస్ ఐన లేడీ కమెడియన్ రోహిణి ఈ షోకి అకుల్ బాలాజీతో కలిసి హోస్ట్ చేస్తోంది. స్టేజి మీద ఉన్న మహేష్ బాబుని చూసేసరికి రోహిణి సిగ్గులమొగ్గయింది. "పిలిచినా రానంటావా" అనే పాటకు డాన్స్ చేసింది. రోహిణి డాన్స్ చూస్తున్న మహేష్ బాబుతో "అలా చూడకండి మీ చూపులు నా వీపుకు గుచ్చుకుంటున్నాయి" అంటూ మూవీ డైలాగ్ చెప్తుంది.
ఆ డైలాగ్ కి సితార పడీ పడీ నవ్వుతుంది. ఇక తర్వాత "హీరోయిన్ అవ్వాలంటే ఏం చేయమంటారు " అంటూ సిగ్గు పడుతూ అడిగేసరికి "సినిమాలు చేయాలి" అంటూ మహేష్ ఆన్సర్ ఇచ్చారు. "నా బుగ్గలు సాగిపోతున్నాయి సర్..నేను మీలా అందంగా ఉండాలంటే ఏం చేయాలి" అన్ని అడిగేసరికి "బాగున్నారండి..బుగ్గలేసుకుని" అని మహేష్ ఆన్సర్ ఇస్తాడు. అంతే గట్టిగా నవ్వుతూ రోహిణి అకుల్ బాలాజీని ఒక్క తోపు తోసేస్తుంది. అతను స్టేజి మీద పడిపోతాడు. ఇలా ఈ వారం మంచి కలర్ ఫుల్ గా ఎంటర్టైన్ చేయబోతోంది ఈ డాన్స్ ఇండియా డాన్స్.