English | Telugu
మా ఇద్దరిదీ ఓడిందా ? డబుల్ మీనింగ్ లో ఆది, పూర్ణ డైలాగ్స్!
Updated : Sep 2, 2022
ఢీ- 14 డాన్సింగ్ ఐకాన్ షోలో పూర్ణ మాటలు నవ్వు తెప్పిస్తాయి. ఆమె ఏ షోలో ఉన్నా అక్కడ నవ్వులే నవ్వులు. అన్ని షోస్ లో పూర్ణ కనిపిస్తూనే ఉంటుంది. పూర్ణ పెట్టే ముద్దులే కాదు, ఇచ్చే హగ్గులు, మాట్లాడే మాటలు అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. పూర్ణతో పాటు హైపర్ ఆది చేసే రచ్చ కూడా అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఢీ-14 షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది.
ఇందులో ఈ మధ్య అఖిల్ సార్థక్ కనిపిస్తున్నాడు. అతని మీద ఆది, ఆది మీద అతను పీల్చుకునే పంచ్ డైలాగ్స్ కి ఆడియన్స్ ఫుల్ ఎంటర్టైన్ అవుతున్నారు. ఇక ఈ లేటెస్ట్ ఎపిసోడ్ లో పూర్ణ మాటలు వింటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ లా అనిపిస్తాయి. చెర్రీ, హేమాక్షి ఇద్దరూ కలిసి "అందర్లోనూ ఉంది సంథింగ్" అనే సాంగ్ కి రొమాంటిక్ డాన్స్ చేస్తారు. ఆ సాంగ్ అయ్యాక ఆ పాటలో చేసినట్టు ఆది, అఖిల్ ఇద్దరూ కలిసి ముద్దు పెట్టుకోవాలనే టాస్క్ ఇచ్చింది పూర్ణ. దీంతో అఖిల్ షాక్ అయ్యి "మీకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తున్నాయంటూ అడిగాడు.
నువ్ నా పక్కన ఆనుకుని కూర్చుకుని రుద్దుతూ ఉంటె అలాటి ఆలోచనలే వస్తాయి మరి" అని అన్నాడు ఆది. "మేం చేయం అంటూ అఖిల్ అనేసరికి మీది ఓడిపోయింది ఈ రౌండ్ లో అంటుంది. మాది గెలిచిందా అంటూ ఆది డబుల్ మీనింగ్ లో మాట్లాడతాడు.ఐతే మా ఇద్దరిదీ ఓడిపోయింది ఐతే" అన్నాడు ఆది. ఫైనల్ ఈ షోలో పూర్ణ డైలాగ్స్ ని అందరూ నవ్వేశారు.