English | Telugu
త్వరలో ఫ్రెండ్‌ని పెళ్లాడబోతున్న భానుశ్రీ?
Updated : Sep 2, 2022
బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక చాలా మంది సెలబ్రిటీ హోదాను అనుభవిస్తున్నారు. యాంకర్ భానుశ్రీ కూడా బీబీ హౌస్ నుంచి వచ్చాకే స్టార్ ఐపోయింది. బుల్లి తెర మీద అల్లరి చేస్తూ తన గొంతుతో అందరిని ఆటపట్టించే భాను ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. త్వరలోనే భానుశ్రీ పెళ్లి చేసుకోబోతుందని ఆమెను పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరు? అంటూ పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు.
ఐతే భానుతన ఫ్రెండ్ నే ప్రేమిస్తోందని, అతన్నే వివాహం చేసుకుంటుందనేవార్త వినిపిస్తుంది. తాను లైఫ్ లో సెటిల్ అవడానికి ఒక ఫ్రెండ్ హెల్ప్ చేసాడని, తనని ఎప్పటికీ మర్చిపోను అంటూ ఒక ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ ని ఇప్పుడు ఈ వార్తకు లింక్ చేసి ఫ్రెండ్ నే మ్యారేజ్ చేసుకోబోతోంది అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒకానొక టైంలో తన ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయక పోయినా అతను తనకు సపోర్ట్ గా నిలబడ్డాడని చెప్పింది. అసలు భానుశ్రీ పెళ్లి వార్త నిజమేనా?, భాను నిజంగా పెళ్లి చేసుకోబోతోందా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.