English | Telugu

పవన్ కళ్యాణ్ తెలిసే మాట్లాడటం లేదు..నాగబాబు అలా చెప్పడం కరెక్ట్ కాదు


నటి మాధవి ఏ విషయంలో ఐనా కానీ కరెక్ట్ కాదు అనుకుంటే వెంటనే ఫైర్ ఐపోతుంది. అలాంటి మాధవి ఇప్పుడు జానీ మాష్టర్ విషయంలో మండిపడింది. దీని మీద ఒక వీడియోని రిలీజ్ చేసింది "పవన్ కళ్యాణ్ ఈ విషయం పై ఎందుకు మాట్లాడ్డం లేదు..ఆయనకు ఈ విషయం గురించి తెలిసే ఆయన అసలు మాట్లాడ్డం లేదు. పార్టీ వేరు..వ్యక్తిత్వం వేరు..జానీ మాష్టర్ గిరినుంచి నాగబాబు పోస్ట్ పెట్టడం ఎం బాలేదండి. ఐనా నాగబాబు గారు మీకు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కంటే ఈ అమ్మాయి చాలా చిన్నది. జనసేనకు సపోర్ట్ చేసాడు కదా అని మీరు జానీకి సపోర్ట్ చేయడం ఏమీ బాలేదు. అలాగే మహాసేన రాజేష్ కూడా ఈ విషయం మీద ట్రోల్ చేసాడు. మీ ఫాలోయర్స్ ని తప్పు దారి పట్టించొద్దు.

జానీ అనే వాడు మీకు మంచి వ్యక్తి అయ్యుండొచ్చు కానీ ఆ అమ్మాయి విషయంలో మాత్రం విలన్ ..పుష్ప 2 సినిమా సాంగ్ షూటింగ్ లో జానీ మాష్టర్ వచ్చి ఆ అమ్మాయిని కొట్టి తిట్టి రచ్చ చేసాడు సుకుమార్ గారు దాని పంచాయతీ చేశారు తర్వాత విశ్వక్ సేన్ మూవీ షూటింగ్ లో ఆ అమ్మాయి కోరియోగ్రఫీ చేస్తుంటే అక్కడికి జానీ మాష్టర్ వచ్చి రచ్చా చేసాడు. జానీ మాష్టర్ ఆ అమ్మాయి సెల్ కి వందల మెసేజెస్ పంపించాడు. ఐ మిస్ యు, ఐ లవ్ యు, మతం మారు, పెళ్లి చేసుకో, షూటింగ్ స్టాప్ చేసి నన్ను కలవు లేదంటే చంపేస్తాను ఇలా టార్చెర్ మెసేజెస్ అన్నీ పంపిస్తూ ఉంటాడు. ఎన్నో మూవీస్ కి ఛాన్సెస్ వస్తే వాటిని క్యాన్సిల్ చేయించాడు జానీ మాష్టర్. టాలెంట్ పరంగా గొప్పోడు అయ్యుండొచ్చు కానీ వ్యక్తిత్వం పరంగా మాత్రం గొప్పోడు అయ్యుండక్కర్లేదు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.