English | Telugu

పెళ్ళైనా పర్లేదు నాకు ఓకే అంటున్న...నాని గారు


కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ వీకెండ్ తో ఈ షోకి ఎండ్ కార్డు పడబోతోంది. ఇప్పుడు దీని ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ వీకెండ్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి చీఫ్ గెస్ట్ గా "సరిపోదా శనివారం" ప్రొమోషన్స్ కోసం నేచురల్ స్టార్ ఎంట్రీ ఇచ్చాడు. "దసరా" మూవీ స్టెప్స్ అలరించాడు. ఇక నాని రావడమే తమిళ 'బిగ్ బాస్' ఫేమ్, ఆయేషా ఖాన్ ఎగురుకుంటూ వచ్చి హగ్ చేసేసుకుంది. వెంటనే శ్రీముఖి “హలో ఆయనకు పెళ్లైంది” అని అయేషాకు చెప్పింది.. “ఇట్స్ ఓకే పర్లేదండి” అని ఆయేషా చెప్పేసరికి నాని కూడా “అయితే, ఇట్స్ ఓకే..నాక్కూడా పర్లేదు” అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసరికి అందరూ ఫుల్ ఖుషీ ఇపోయారు.

ఇక బ్రాహాముడి కావ్య ఎంట్రీ ఇచ్చింది. "నాని గారు అమ్మాయిలు ఎలా అంటే పానీ లేకుండా ఉంటారు కానీ నానిని చూడకుండా ఉండలేరు" అని బాగా హడావిడి చేసింది. "నాని గారు మీరు దసరా మూవీలో నటించారు కానీ మీరు వచ్చిన ఈ రోజు మాకు దీపావళినే" అని చెప్పింది కావ్య. ఇక ప్రేరణ ఐతే "నాని గారిని చూస్తుంటే గుండె కంట్రోల్ లో ఉండడం లేదు...ఇంక డౌట్స్ ఎం వస్తాయి.." అని అన్నది. "మీ ఆయన్ని గుర్తుచేసుకో" అంది శ్రీముఖి. "నాని గారు ఉన్నప్పుడు మా ఆయన్ని గుర్తుచేసుకోను" అంది ప్రేరణ. ఇక నాని ఐతే "మీ పెళ్లి గుర్తుపెట్టుకోకపోయినా నా పెళ్లిని గుర్తుపెట్టుకోండి" అన్నాడు కామెడీగా. ఇలా ఈ వారంతో ఈ గేమ్ షో ఎండ్ కాబోతోంది. ఈ గేమ్ షోలో గెలిచిన టీమ్ కు రూ. 20 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు నిర్వాహకులు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.