English | Telugu

Karthika Deepam2 : ఎమోషనల్ అయిన శ్రీధర్.. వ్రతానికి సుమిత్ర రానుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -449 లో.. జ్యోత్స్నకి దిష్టి తీస్తుంది సుమిత్ర. దీప, కార్తీక్ పెళ్లి జరిగింది.. ఇక ఆ దోషం పోయినట్లే అని శివన్నారాయణ అంటాడు. దీప తాళి తెంపి జ్యోత్స్న మంచి పని చేసింది. ఆ అనాధకి దశరథ్, సుమిత్ర తల్లి దండ్రుల స్థానంలో ఉండి పెళ్లి చేసే అదృష్టం వచ్చింది. ఇక రేపు వ్రతానికి వెళ్లి అది దగ్గర ఉండి జరిపించి వస్తే మన బాధ్యత పూర్తి అవుతుందని పారిజాతం అనగానే ఈ మధ్య మంచిగ ఆలోచిస్తున్నావని శివన్నారాయణ అంటాడు. దాంతో పారిజాతం మురిసిపోతుంది.

సుమిత్ర నువ్వు కూడా వస్తావ్ కదా అని పారిజాతం అనగానే నేను టైడ్ అయ్యనని కోపంగా లోపలికి వెళ్తుంది. మరొకవైపు శ్రీధర్ కి కార్తీక్ ఫోన్ చేస్తాడు. ఈ టైమ్ కి చేసావ్ ఏంటని శ్రీధర్ అడుగుతాడు. నీకు థాంక్స్ చెప్పాడనికి చేశానని కార్తీక్ అంటాడు. భోజనం చేసావా అని శ్రీధర్ ని కార్తీక్ అడుగగానే శ్రీధర్ ఎమోషనల్ అవుతాడు. చేసాను నువ్వు చేసావా అని శ్రీధర్ ప్రేమగా మాట్లాడతాడు. ఎక్కువ డ్రింక్ చెయ్యకు అని కార్తీక్ ఫోన్ కట్ చేస్తాడు. చాలా రోజులకి తన కొడుకు ప్రేమగా మాట్లాడాడని శ్రీధర్ ఎమోషనల్ అవుతాడు.

ఆ తర్వాత సత్యనారాయణ వ్రతానికి అనసూయ కాంచన ఏర్పాట్లు చేస్తుంటారు. అప్పుడే పారిజాతం, జ్యోత్స్న వస్తారు. మీకు హెల్ప్ చెయ్యడానికి మేము వచ్చాము.. వెనకలా వాళ్ళు పూజ టైమ్ కి వస్తారని పారిజాతం అనగానే.. అందరు ఆశ్చర్యంగా చూస్తారు. పెళ్లి అయిన ఇల్లు ఇలా ఉంటుందా అని శౌర్యాతో పాటు పారిజాతం, జ్యోత్స్న డ్యాన్స్ చేస్తుంటారు. పారిజాతం, జ్యోత్స్న అలా బెహేవ్ చేస్తుంటే అందరు ఆశ్చర్యంగా చూస్తారు. మరొకవైపు శివన్నారాయణ, దశరథ్ రెడీ అయి సుమిత్రని పిలుస్తారు. నేను రానని సుమిత్ర చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.