English | Telugu

Karthika Deepam2 : ఒక్కటైన కార్తీక్, దీప.. జ్యోత్స్నకి దిష్టి తీసిన సుమిత్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -448 లో..... దీప, కార్తీక్ ల పెళ్లి అయి దీపకి దశరథ్ అప్పగింతలు జరుపుతుంటే.. దీప ఎమోషనల్ అవుతుంది.అదంతా చూసి సుమిత్ర లోపలికి కోపంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కుబేర్ ఫోటోకి అనసూయ దీపం పెడుతుంది. నువ్వు కన్నతండ్రి కాకపోయినా దీపకి నువ్వు అంటే చాలా ఇష్టం అని అంటుంది.

అప్పుడే స్వప్న, కాశీ ఎంట్రీ ఇస్తారు. అన్నయ్య వదిన ఎక్కడ అని అనసూయని అడుగుతారు. అప్పుడే శౌర్య వస్తుంది. నువ్వు మగ పిల్లాడివి అయితే నీకోసం ఒక కూతురిని కనేదాన్ని అని స్వప్న సరదాగా మాట్లాడుతుంది. దీపని కార్తీక్ పిలిచి ఇద్దరి చేత స్వప్న కేక్ కట్ చేయిస్తుంది. దాంతో ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు.మరొకవైపు శ్రీధర్ ని చూసి.. అక్కవాళ్ళ దగ్గరే ఉండకపోయారా ఇల్లు సందడిగా ఉంటుందని కావేరి అంటుంది. దానికి శ్రీధర్ వెటకారంగా మాట్లాడతాడు.

ఆ తర్వాత పెళ్లిచీరని చూస్తూ దీప హ్యాపీగా ఫీల్ అవుతుంటే..అప్పుడే కార్తీక్ వస్తాడు. పెళ్లి టైమ్ కి తాళి తీసింది జ్యోత్స్ననే అని దీప అంటుంది. లేదు అత్తయ్య తీశారని కార్తీక్ మనసులో అనుకుంటాడు చివరికి అయితే తాత మా అమ్మమ్మ తాళి తీసుకొని వచ్చాడు కదా.. పెళ్లి అయింది కదా అని కార్తీక్ అంటాడు. నన్ను దీవించండి అని కార్తీక్ కాళ్ళు మొక్కుతుంది దీప. కార్తీక్ దీవిస్తుంటే.. బాగా దీవించావ్ బావ అని కార్తీక్ చెంపపై ముద్దుపెడుతుంది దీప. దాంతో కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు జ్యోత్స్నకి దిష్టి తీస్తుంది సుమిత్ర. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.