Read more!

English | Telugu

మోనిత‌కు దిమ్మ‌దిరిగే షాకిచ్చిన వంట‌ల‌క్క‌

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్‌ల‌లో ముందు వ‌రుస‌లో నిలిచింది `కార్తీక దీపం`. ముఖ్యంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని టీవీల‌కు అతుక్కుపోయేలా చేసి రేటింగ్ ప‌రంగా రికార్డుని సృష్టించింది. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల‌కు సైతం దీని సెగ త‌గల‌డం.. టైమింగ్ ని మార్చండి మ‌హా ప్ర‌భో అంటూ క్రికెట్ ప్రేమికులు అభ్య‌ర్ధ‌న‌లు చేయ‌డంతో ఈ సీరియ‌ల్ మ‌రింత‌గా పాపులారిటీని సొంతం చేసుకుంది.

దేశ వ్యాప్తంగా నంబ‌ర్ వ‌న్ సీరియ‌ల్‌గా రేటింగ్‌ని సొంతం చేసుకుని టాప్ వ‌న్‌లో కొన‌సాగుతున్న `కార్తీక దీపం` చిత్ర విచిత్ర‌మైన ట్విస్ట్‌ల‌తో.. మ‌లుపుల‌తో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ మంగ‌ళ‌వారం 1204వ ఎపిసోడ్‌లోకి ఎంట‌ర్ అవుతోంది. గ‌త కొన్ని రోజులుగా సాగ‌దీత ధోర‌ణిలో సాగుతూ ప్రేక్ష‌కుల‌కు విసుగుపుట్టిస్తున్న `కార్తీక దీపం` ఈ రోజు ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపుల‌తో ప్రేక్ష‌కుల్ని థ్రిల్‌కి గురిచేయ‌బోతోంది. మోనిత ఇంట బార‌సాల‌కు కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వ‌స్తాన‌ని, ఈ సారి క్లైమాక్స్‌ని డిఫ‌రెంట్‌గా ప్లాన్ చేశాన‌ని చెప్పి వెళ్లిపోయిన దీప మ‌రోసారి మోనిత ఇంట వంట‌ల‌క్క అవ‌తారం ఎత్తుతుంది.

అంత‌కు ముందు మోనిత‌, డాక్ట‌ర్ భార‌తి, ప్రియ‌మ‌ణి మాట్లాడుకుంటుండ‌గా చేతిలో బ్యాగుతో ఎంట్రి ఇచ్చి షాకిస్తుంది దీప‌. దీప రాక‌ని ఊహించ‌ని భార‌తి, మోనిత‌, ప్రియ‌మ‌ణి షాక్‌కు గుర‌వుతారు. త‌రువాత త‌న బ్యాగ్‌ని ప్రియ‌మ‌ణికిచ్చి లోప‌ల పెట్ట‌మ‌ని ప‌నుల్లోప‌డిపోతుంది దీప‌. మోనిత ఇంటికి వ‌చ్చిన డాక్ట‌ర్ బాబు అక్క‌డ వంట‌ల‌క్క గెట‌ప్‌లో దీప‌ని చూసి ఆగ్ర‌హాంతో ఊగిపోతాడు. న‌వ్వు వంట‌లు చేయ‌డం ఏంట‌ని మండిప‌డ‌తాడు. అయితే బార‌సాల కానివ్వండ‌ని చెబుతుంది. ఆ త‌రువాత మోనిత తాను కార్తీక్ వ‌ల్ల గ‌ర్భం దాల్చాన‌ని చెప్ప‌డం.. అది స‌హ‌జ గ‌ర్భం కాద‌ని దీప ఆధారాన్ని చూపించడంతో అంతా షాక్‌కి లోన‌వుతారు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?  దీప ఇచ్చిన షాక్‌కు మోనిత ఎలా రియాక్ట్ అయింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.