English | Telugu

"హిమను చంపింది నేనే" అని చెప్పిన‌ మోనిత... అంజిని కూడా చంపిందా?

కార్తీక్‌ కోసం మోనిత ఎంత దూరమైనా వెళ్తుందని చెప్పడానికి ఈ రోజు ఎపిసోడ్‌ ఉదాహరణగా నిలుస్తుంది. అలాగే, కార్తీక్‌ మీద మోజులో మోనిక ఎంత తప్పు చేయడానికైనా వెనుకాడదని, హత్యలు చేయడానికి ఓ క్షణం కూడా ఆలోచించదని ప్రేక్షకులకు అర్థమవుతుంది. ఇంతకీ, బుధవారం (ఆగస్టు 4, 2021) 1109 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే...

ఎయిట్‌ హోటల్‌లో ఉన్న అంజి కోసం వంటలక్క అలియాస్‌ దీప, మోనిత బయలుదేరిన సంగతి తెలిసిందే. మోనిత కారు ట్రబుల్‌ ఇవ్వడంతో లిఫ్ట్‌ అడిగి వంటలక్క కారు ఎక్కిన‌ విషయమూ విదితమే. ఫోనులో మోనిత మాట్లాడుతున్న మాటలను వెనుక కూర్చున్న వంటలక్క వింటూ ఉంటుంది. అయితే, వాటర్‌ బాటిల్‌ కనిపించడం లేదని వెంకటేశ్‌ను లైట్‌ వేయమని మోనిత అడుగుతుంది. లైట్‌ వేశాక... వెనుక సీట్‌లో ఉన్న వంటలక్కను చూస్తుంది. షాక్‌ అవుతుంది.

అంజి కోసం వెళ్తున్నట్టు ఇద్దరూ ఒకరికొకరు చెప్పుకోరు. మోనితకు వంటలక్క ‘విజయవాడ దుర్గ గుడికి’ అని చెబితే... వంటలక్కకు మోనిత ‘ఎయిట్‌ హోటల్‌లో వంటవాళ్లు బాగా చేస్తారని విన్నా. రేపు జరగబోయే నా పెళ్లికి తీసుకువెళదామని’ అని అబద్దాలు ఆడతారు. మోనితను హోటల్‌ దగ్గర దింపిన వంటలక్క విజయవాడ వెళ్తున్నట్టు నటిస్తుంది. మళ్లీ వెనక్కి తిరిగి వస్తుంది.

హోటల్‌లో ఉన్న అంజిని మోనిత పట్టుకుంటుంది. గన్‌ గురిపెడుతుంది. ‘మారిపోయానమ్మా’ అని అంజి కాళ్ల మీద పడి బతిమాలతాడు. అయినా అతడిని మోనిత వదలదు. ‘నేను కార్తీక్‌ను ఎలా వదిలేస్తాననుకున్నావ్‌? దీపమ్మా దీపమ్మా అంటుంటావ్‌ కదా! ఆ దీపమ్మ కోసం చచ్చిపో. ఆ హిమను చంపిందీ నేనే’ అని మోనిత ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా దొంగచాటుగా వంటలక్క వీడియో తీస్తుంది. ఇంతలో గన్‌ సౌండ్‌! అంజిని మోనిత షూట్‌ చేసినట్టు అనిపిస్తుంది. మరి, నిజంగా అంజిని మోనిత చంపిందా? లేదా? ఆగస్టు 5న టెలికాస్ట్‌ అయ్యే ‘కార్తీక దీపం’ 1110 ఎపిసోడ్‌లో చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.