English | Telugu

సుమిత్ర, దశరథ్ ల పెళ్ళిరోజుని సెలబ్రేట్ చేసిన కార్తీక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -504 లో... సుమిత్ర, దశరథ్ ఇద్దరు ఇంట్లోకి వస్తారు. సుమిత్ర వచ్చిందంటే కారణం కార్తీక్ అని అందరు పొగుడుతుంటే జ్యోత్స్న కోపంగా పైకి వెళ్తుంది. తనతో పాటు తన వెనకాలే పారిజాతం వెళ్తుంది.

ఏంటే మీ అమ్మ వచ్చింది కనీసం దగ్గరికి కూడ వెళ్ళాలేదని పారిజాతం ఆడుగుతుంది. కనీసం మా మమ్మీ నా మొహం కూడా చూడలేదని జ్యోత్స్న కోప్పడుతుంది. ఇప్పుడు మీ అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు అని రిక్వెస్ట్ చెయ్.. నువ్వు తప్పు చేసావ్.. ఇప్పుడు అందరు హ్యాపీగా ఉన్నారు.. నువ్వు చేసిన తప్పు మర్చిపోతారని పారిజాతం అంటుంది. జ్యోత్స్నని పారిజాతం కిందకి తీసుకొని వెళ్తుంది.

మరొకవైపు స్వప్న, కావేరి ఇద్దరు సుమిత్ర గురించి టెన్షన్ పడుతుంటే.. స్వప్నకి కార్తీక్ మెసేజ్ చేస్తాడు. సుమిత్ర అత్త ఇంటికి వచ్చింది.. అందరం ఇక్కడే ఉన్నామని.. మీరు రండీ అని కార్తీక్ మెసేజ్ చేస్తాడు. దాంతో స్వప్న హ్యాపీగా ఫీల్ అయి వాళ్ళ అమ్మకి చెప్తుంది. మనం వెళదామని స్వప్న, కాశీ అంటారు. వద్దని కావేరి అంటుంది.

మరొకవైపు పాపం జ్యోత్స్న పైకి వెళ్లి వాళ్ళ అమ్మ గురించి బాధపడుతుంటే తీసుకొని వచ్చానని పారిజాతం కవర్ చేస్తుంది. తనకి కౌంటర్ వేస్తూ కార్తీక్ మాట్లాడతాడు. ఆ తర్వాత సుమిత్ర జరిగింది మొత్తం ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. దీప లేకపోయి ఉంటే నేను ఇలా మీ అందరి ముందు ఉండేదాన్ని కాదని సుమిత్ర అంటుంది.

నేను చెప్పాను కదా మమ్మీ గురించి దీపకి తెలుసని జ్యోత్స్న అంటుంది. ఏది ఏమైనా సుమిత్ర ఇంటికి వచ్చిందంటే అది ఖచ్చితంగా దీప, కార్తీక్ వల్లనే అని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత సుమిత్ర, దశరథ్ ల పెళ్లి రోజుని కార్తీక్ సెలబ్రేట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.