English | Telugu

Karthika Deepam 2 : పారిజాతం పనిమనిషా.. కూతురి ప్రేమని ఒప్పుకున్న తండ్రి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -150 లో..... మీరు ఇంత బాగా వంట చేస్తారు కదా మా రెస్టారెంట్ లో వర్క్ చెయ్యండి అని కార్తీక్ అంటాడు. నేను వర్క్ చేసే ప్లేస్ కి వచ్చి ఇలా చేసాడు. ఇక రెస్టారెంట్ లో వర్క్ చేస్తే నరసింహా గురించి తెలుసు కదా అని దీప అంటుంది. మీరెందుకు ఇలా చేశారని దీప అనగానే.. మీరు లేకుంటే శౌర్య ఉండలేదు అందుకే అని కార్తీక్ అంటాడు. అంతా నా వల్లే మీరు పెళ్లి కొడుకుగా ఉండాల్సిన వాళ్ళు ఇలా పేషేంట్ అయ్యారని దీప బాధపడుతుంది.

ఆ తర్వాత శ్రీధర్, కావేరి ఇంటికి వస్తాడు. అక్కడికి వెళ్తే  నా కొడుకు పెళ్లి గురించి, ఇక్కడికి వస్తే నా కూతురు పెళ్లి గురించి టెన్షన్ అని శ్రీధర్ అనుకుంటు ఇంట్లోకి వస్తుంటాడు. అప్పుడే స్వప్న ఫ్యాన్ క్లీన్ చేస్తుంటుంది. అది చూసి స్వప్న సూసైడ్ చేసుకుంటుందని కంగారు పడుతాడు. నేను అలా పిరికిదాన్ని కాదంటూ శ్రీధర్ కే ఎదురు మాట్లాడుతుంది స్వప్న. మా నాన్నకి మన గురించి ఛాన్స్ ఇవ్వలేదు కానీ స్వప్న మనకి ఇస్తుంది. కొంచెం ఆలోచించండి అని శ్రీధర్ తో కావేరి అంటుంది. 

ఆ తర్వాత శౌర్య తులసి చెట్టు దగ్గర దీపం పోతుంటే పోకుండా చెయ్ అడ్డుపెడుతుంది. కార్తీక్ బాగుండాలంటూ మొక్కుకుంటుంది. అప్పుడే పారిజాతం వచ్చి అన్నీ మీరే చేస్తారు.. మీరే కోరుకుంటారు.. అసలు మీ నాన్న ఇదంతా చేసాడు అని అనబోతుంటే అనసూయ వచ్చి పారిజాతాన్ని ఆపుతుంది. అనసూయ, దీపలని  పారిజాతం తిడుతుంది. నువ్వు మా అమ్మని తిడితే కార్తీక్ కి చెప్తానని శౌర్య అనగానే.. పారిజాతం భయపడుతుంది. అదంతా శివన్నారాయణ చూసి వచ్చి పారిజాతాన్ని తిడుతాడు. నువ్వేం చేసావో నేను చూసాను.. నిన్ను అనసూయ తిట్టకుండా వెళ్ళింది నేను అలా కాదు.... నువ్వు ఎక్కడ నుండి వచ్చావో మర్చిపోయావా అని శివన్నారాయణ అనగానే పారిజాతం పనిమనిషిగా ఉన్న రోజులు గుర్తుచేసుకుంటుంది.

ఆ తర్వాత శ్రీధర్ దగ్గరికి కావేరి వస్తుంది. ఒక ఆడది మగాడిని ఇష్టపడడం తప్పైతే ఆ తప్పు చెయ్యని ఆడది ఉండదు. మన అమ్మాయి కూడా అందరిలాంటి ఆడపిల్ల‌.. అది ఒక కుర్రాడిని ప్రేమించింది దాని కారణం దానికి ఉంది.. మీ కారణం మీకు ఉంది.. అది అనుకున్నది జరగపోతే నిజంగానే ఈ సారి ఫ్యాన్ క్లీన్ కాకుండా.. ఇంకేదైనా చేసుకుంటే ఎలా అని కావేరి చెప్తుంది. ఒకసారి అబ్బాయిని కలవమని అనగానే శ్రీధర్ సరేనంటాడు. అప్పుడే స్వప్న వచ్చి హ్యాపీగా అతడి నెంబర్, అడ్రెస్ ఇస్తుంది. థాంక్స్ మమ్మీ అంటు కావేరికి స్వప్న చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.