English | Telugu

Bigg Boss 8 Telugu: యష్మీ, నైనిక చీఫ్ గా ఫెయిల్.. హౌస్ లో కొత్త చీఫ్ ఎవరంటే!

బిగ్ బాస్ హిస్టరీలోనే ఎన్నడు లేని విధంగా.. అన్నీ ఊహించని విధంగా జరుగుతున్నాయి. ప్రతి సీజన్ లో కెప్టెన్సీ టాస్క్ ఉంటుంది. కానీ ఈ సీజన్ లో క్లాన్స్ ఉన్నాయి. లిమిట్ లెస్ రేషన్, లిమిట్ లెస్ ప్రైజ్ మనీ కావడంతో మొదటి వారం టాస్క్ లో గెలిచిన ముగ్గురు ఇంటి సభ్యులని క్లాన్స్ చేశారు బిగ్ బాస్.

నైనిక, యష్మీ, నిఖిల్ ముగ్గురు క్లాన్స్.. వీరిలో యష్మీ ఎక్కువ ఇంటిసభ్యులు కలిగిన క్లాన్ అందుకే తనకి బిగ్ బాస్ పవర్స్ ఇచ్చాడు. యష్మీ తన క్లాన్ కి చీఫ్గా వ్యవహరించింది. అయితే అతి తక్కువ క్లాన్ మెంబర్స్ ని కలిగి ఉంది నిఖిల్.

అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో యష్మీ, నైనిక లని క్లాన్స్ గా ఫెయిల్ అయ్యారు. మిమ్మల్ని డిస్ క్వాలిఫై చేస్తున్నానని నాగార్జున చెప్పాడు. వాళ్ళు డిస్ క్వాలిఫై అవ్వడానికి కారణం కూడా నాగార్జున చెప్పాడు. రేషన్ విషయంలో నెగ్లెట్ చెయ్యడం.. అంతేకాకుండా అతి తక్కువ క్లాన్ కలిగిన నిఖిల్ క్లాన్ సంపాదించిన అమౌంట్ మీ రెండు టీమ్ లు సంపాదించిన దానికంటే ఎక్కువ. అందుకే మిమ్మల్ని ఛీఫ్ లుగా డిస్ క్వాలిఫై చేస్తున్నానంటు నైనిక, యష్మీలని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా హౌస్ లో ఇంకొక క్లాన్ ఉంటారు. మీరందరు ఎవరు క్లాన్ గా ఉండాలో.. ఎవరు ఉండకూడదో.. వాళ్ళ ముందు ఉన్న గ్లాస్ లో‌‌.. క్లాన్ గా ఉండాలి అనుకునే కంటెస్టెంట్ దగ్గర ఉన్న గాజు సీసాలో వైట్ వాటర్ పోయాలి‌‌.. ఎవరు వద్దని అనుకుంటారో వారి గాజు గ్లాస్ లో బ్లాక్ వాటర్ పొయ్యాలని నాగార్జున చెప్పాడు. ఎవరిది ఎక్కువ గ్లాస్ లో ఉంటే వాళ్లే న్యూ క్లాన్ కి లీడర్ అని నాగార్జున చెప్తాడు.

దాంతో అందరు తమకు నచ్చిన వాళ్ళకి ఓటు వేస్తారు. నచ్చని వాళ్ళకి బ్లాక్ వాటర్ పోస్తారు. అయితే చివరికి అభయ్ వైట్ గ్లాస్ ఎక్కువ ఉండడంతో అతనే న్యూ క్లాన్ అని నాగార్జున అనౌన్స్ చేస్తాడు. ఆ క్లాన్ లోకి ఎవరు ఆడ్ అవుతారనేది ముందు ముందు తెలుస్తుందంటూ కొంచెం ఆసక్తిని పెంచే మాటలతో శనివారం ఎపిసోడ్ ని ముగించాడు నాగార్జున. ప్రస్తుతం హౌస్ లో పదమూడు మంది ఉండగా అందులో ఎనిమిది మంది నామినేషన్ లో ఉన్నారు. వారిలో నైనిక సేవ్ చేశాడు నాగార్జున.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.