English | Telugu

Karthika Deepam 2 : దీపని చంపడానికి జ్యోత్స్న ప్లాన్.. కార్తీక్ ఏం చేయగలడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -144 లో.....రెండు రోజుల్లో బావతో నా పెళ్లి అని జ్యోత్స్న చెప్పగానే.. అవునా మంచి మాట చెప్పావని దీప అంటుంది. అలా అనగానే పైకి ఎంత మంచిగా మాట్లాడుతున్నావ్ దీప అని జ్యోత్స్న అనుకుంటుంది. నువ్వు వంటలు బాగా చేస్తావ్ కదా అందుకే ఇక నువ్వే వంటలు చెయ్యాలని జ్యోత్స్న అంటుంది. తను వంటలు చెయ్యడానికి వంట మనిషి కాదు గెస్ట్ అని కార్తీక్ అంటాడు. అమ్మని తీసుకొని వెళ్తానని కార్తీక్ అంటాడు. రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఎక్కడికి.. అత్తయ్య కూడా ఇక్కడే ఉంటుంది మావయ్యని ఇక్కడికే రమ్మని చెప్తానని జ్యోత్స్న అనగానే.. సరే అమ్మతో మాట్లాడమని కార్తీక్ అంటాడు.

ఆ తర్వాత జ్యోత్స్న వెళ్లిపోతు.. ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలని ట్రై చేస్తావని తెలుసు దీప అని అనుకుంటుంది. ఈ పెళ్లి త్వరగా జరగాలని దీప మనసులో అనుకుంటుంది. మరొకవైపు శ్రీధర్ కావేరితో స్వప్న పెళ్లికి ఈ బుధవారం మంచి ముహూర్తం ఉందని స్వప్న, శ్రీకాంత్ కి మన ఇంట్లోనే పెళ్లి అని శ్రీధర్ అంటాడు. అప్పుడే స్వప్న వచ్చి.. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తాడు. కాశీనే పెళ్లి చేసుకుంటా అని స్వప్న అనగానే.. తనపై శ్రీధర్ కోప్పడతాడు. అతని గురించి ఏమైనా తెలుసా.. పేరెంట్స్ ఎవరు? జాబ్ ఉందా అని అడుగుతాడు. పేరెంట్స్ గురించి తెలియదు కానీ జాబ్ కి ట్రై చేస్తున్నాడని స్వప్న అంటుంది. అవసరం లేదు.. చూస్తూ చూస్తూ నీ జీవితం నాశనం చెయ్యలేనని శ్రీధర్ అంటాడు. నేను అనుకున్నది జరగడానికి ఎంత దూరమైనా వెళ్తానని శ్రీధర్ అంటాడు. నేను కూడా అంతే అని స్వప్న తండ్రితో వాదిస్తుంది.

మరొకవైపు నరసింహా పని అయ్యాక ఇంటికి వస్తానని అంటాడు. ఏం చేస్తున్నావో చెప్పు నా జాగ్రత్తలో నేను ఉంటానని శోభ అనగానే.. చెప్తే పనులు అవట్లేదని నరసింహా వెళ్తాడు. ఆ తర్వాత జ్యోత్స్న ఫ్రెండ్స్ కి బ్యాచిలర్ పార్టీ ఇస్తుంది. దానికి కార్తీక్ ని కూడా పిలుస్తుంది. ఆ తర్వాత కార్తీక్ పెళ్లికి బట్టలు ఎప్పుడు కొనుకుందామని శౌర్య అడుగుతుంది. నీకు కొంటానులే అని దీప అంటుంది. మరి నీకు అని శౌర్య అనగానే.. నేను కొంటా అని అనసూయ అంటుంది. మరి నీకు అని శౌర్య అనగానే.. నువ్వు పెద్ద అయ్యాక కొను అని అనసూయ అంటుంది.

జ్యోత్స్న ప్లాన్ లో భాగంగా.. దీప దగ్గరికి ఒకావిడా వచ్చి.. మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. వంటలు చెయ్యాలని డబ్బులు ఇచ్చి వెళ్తుంది. ఆ తర్వాత దీప వెళ్తుంటే.. అప్పుడే కార్తీక్ ఎదురుపడతాడు. దీపని కార్ ఎక్కించుకొని తీసుకొని వెళ్తాడు. జ్యోత్స్న బ్యాచిలర్ పార్టీ ఇస్తుందని అందుకే వెళ్తున్నానని కార్తీక్ అనగానే.. చివరి వరకు ఉండండి, లేకపోతే మళ్ళీ గొడవ అవుతుందని చెప్తుంది. ఆ తర్వాత దీప కార్ దిగి వెళ్ళిపోతుంది. అప్పుడే కార్తీక్ కి జ్యోత్స్న ఫోన్ చేస్తుంది. దీప కార్ లో ఫోన్ మర్చిపోతుంది. అప్పుడే ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ ఎవరిదని జ్యోత్స్న అంటుంది. ఇక్కడ కాదు అని చెప్తాడు. ఆ తర్వాత కార్తీక్ ఫోన్ కట్ చేసాక.. వెనక్కి తిరిగి చుస్తే దీప ఫోన్ కన్పిస్తుంది. తన ఫోన్ ఇవ్వడానికి దీప దగ్గరికి కార్తీక్ వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.